సిటీకి మిస్టర్ వరల్డ్‌: రోహిత్ గురించి తెలియని విషయాలు(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మిస్టర్ వరల్డ్‌గా ఎంపికైన తొలి భారతీయుడు, హైదరాబాదీ రోహిత్ ఖండేల్వాల్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం హైదరాబాద్ చేరుకున్న రోహిత్‌ను బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో అరోరా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఆధ్వర్యంలో సన్మానించారు.

మిస్టర్ వరల్డ్‌గా హైదరాబాదీ: చరిత్ర సృష్టించిన రోహిత్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ విద్యార్థులు కలలు కని వాట సాకారానికి నిరంతరం శ్రమించాలని మిస్టర్‌ వరల్డ్‌ రోహిత్‌ ఖండేల్వాల్‌ పిలుపునిచ్చారు. 47మందిలో తాను మిస్టర్‌ వరల్డ్‌గా విజయం సాధించడం గొప్ప సంతృప్తినిచ్చిందన్నారు.

ఎమ్మెల్యే కె.లక్ష్మణ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌, అరోరా ప్రిన్సిపల్‌ విశ్వనాథం బులుసు, కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, రోహిత్‌ ఖండేల్వాల్‌ సోదరుడు రాహుల్‌ ఖండేల్వాల్‌, శీతల్‌ పాల్గొన్నారు.

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్

మోడలింగ్ చేసే కంటే ముందు రోహిత్ ఖండేల్వాల్ హైదరాబాద్‌లోని ఆరోరా డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించారు. అంతేగాక, స్పైస్‌జెట్‌లో కూడా పని చేశారు.

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్‌కు ట్రావెలింగ్ అంటే ఇష్టం. అంతేగాక, ఇతడో మంచి వంటగాడు కూడా.

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే బాలీవుడ్ నటి కరీనా కపూర్‌తో ఖండేల్వాల్ ఒక కమర్షియల్ లో నటించారు. అదే అతని తొలి కమర్షియల్.

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్

మోడలింగ్‌ను ఎంచుకోవడంపై రోహిత్ తల్లిదండ్రులు కొంత ఆందోళనగా ఉండేవారు. మొదట వ్యతిరేకించినప్పటికీ అతని మద్దతుగా నిలిచారు. ఇప్పుడు మిస్టర్ వరల్డ్ అవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్

మిస్టర్ వరల్డ్ 2016 పోటీల్లో భాగంగా రణవీర్ సింగ్ నటించిన ‘బాజీరావు మస్తానీ'లోని ‘మల్హరీ' పాటకు నృత్యం చేశారు.

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్

ఫినాలేలో మిస్ వరల్డ్ 2013 మేగన్ యంగ్‌తో షారుక్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం' సినిమాలోని ఓ డైలాగ్ చెప్పారు.

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్

హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖండేల్వాల్‌కు గత కొంత వరకు కూడా హిందీ స్పష్టంగా రాదు. అయితే, ఎంతో శ్రమించిన రోహిత్ దాన్ని అధిగమించేశాడు.

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్ ఎప్పుడూ ఫిట్‌గా ఉండేవాడు కాదు. అయితే, అతను నిరంతరం శ్రమించి తన శరీరాకృతిని దృఢంగా మార్చేసుకున్నాడు. దాని ఫలితమే మిస్టర్ వరల్డ్.

రోహిత్ ఖండేల్వాల్

రోహిత్ ఖండేల్వాల్

అంతేగాక, రోహిత్ ఖండేల్వాల్ అనేక టీవీ షోలలో కనిపించారు. బిందాస్‌లో ప్రసారమైన ‘యేహ్ హై ఆషిఖీ'తో రోహిత్‌కు మంచి గుర్తింపు తెచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mr world title winner Rohit Khandelwal arrived Hyderabad on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి