వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేడారం మహాజాతరకు రూ. 147 కోట్లు

|
Google Oneindia TeluguNews

జయశంకర్‌‌భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం పరిధి మేడారంలో రెండేళ్లకోసారి జరిగే శ్రీసమ్మక్క-సారలమ్మ మహా జాతర ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. శాశ్వత ప్రాతిపదికన ఎక్కువ పనులు చేయాలని నిర్ణయించి ఆ మేరకు రూ. 147 కోట్లతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం పంపింది.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను 2017 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించబోతున్నట్లు పూజారుల సంఘం ఇటీవల ప్రకటించింది. జాతరకు ప్రతి ఏడాది వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేయిస్తున్న బడ్జెట్ పెరుగుతోంది. 2016 జాతర సందర్భంగా రూ. 108 కోట్లు కేయించారు.

Rs 147 crores for Medaram Jatara

అంతకు ముందు 2014 జాతర సందర్బంగా రూ. 60 కోట్లు కేయించారు. గతంలో కేటాయించిన నిధుల కంటే ఈ సారి రూ. 39 కోట్లు అదనంగా కేయించారు. జాతరకు భక్తులు సులభంగా చేరుకునేలా కొత్తు రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో రోడ్లు భవనాల శాఖకు రూ. 74 కోట్ల నిధులు దక్కాయి. ఈ నిధులతో ప్రధానంగా భూపాలపల్లి-మేడారం రోడ్డు విస్తరణ, కారం-మేడారం రోడ్డు పనులు చేప్టాలని నిర్ణయించారు. వీరితోపాటు మేడారం-షాపల్లి-చిన్నబోయినపల్లి వరకు రోడ్డు నిర్మించనున్నారు.

English summary
Telangana Government have to sanction Rs 147 crores for Medaram Jatara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X