హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూబ్లీహిల్స్ కార్పొరేట్ ఆస్పత్రి: రూ. 52 లక్షల బిల్లు కట్టినా.. నిలువని యువ వైద్యురాలి ప్రాణం, నిర్లక్ష్యమే..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఆగడం లేదు. చికిత్స పొందుతూ మరణించినా.. బిల్లులు కట్టందే మృతదేహాలను కూడా ఇవ్వకుండా కొన్ని ఆస్పత్రులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ యువ వైద్యురాలి ప్రాణం పోయింది. అయితే, బాధితుల నుంచి అరకోటికిపై ఫీజు వసూలు చేయడం గమనార్హం.

కరోనా తర్వాత అనారోగ్యంతో మరో కార్పొరేట్ ఆస్పత్రికి..

కరోనా తర్వాత అనారోగ్యంతో మరో కార్పొరేట్ ఆస్పత్రికి..

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని కొంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్ భావన(31)కి 15 నెలల క్రితం అదే ప్రాతంలోని డాక్టర్ కళ్యాణ్‌తో వివాహం జరిగింది. బేగంపేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో భావన రేడియాలజిస్టుగా పనిచేస్తున్నారు. వివాహం తర్వాత ఆమె వృత్తికి దూరంగా ఉన్నారు. కరోనా బారినపడటంతో ఏప్రిల్ 22న భావన.. కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అక్కడే మే 6 వరకు చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏర్పడిన అనారోగ్య సమస్యలతో.. ఎక్మో అవసరం కావడంతో జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. సుమారు 26 రోజులపాటు అక్కడే చికిత్స పొందారు.

వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి అంటూ భర్త..

వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి అంటూ భర్త..


ఈ క్రమంలో బుధవారం ఆమెకు అమర్చిన ఎక్మో సరిగా లేకపోవడంతో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం కారిపోయిందని, ఆస్పత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని భావన భర్త కళ్యాణ్ ఆరోపించారు. ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్ స్థాయి 94గా ఉందని, ఆ తర్మావ పైపు సరిగా లేకపోవడంతో 64కు పడిపోయిందని తెలిపారు. ఆ తర్వాత ఫ్లూయిడ్ ఓవర్ లోడ్ చేయడంతో గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని చెప్పారు.

చికిత్సకు రూ. 52 లక్షల బిల్లు కట్టామంటూ ఆవేదన

చికిత్సకు రూ. 52 లక్షల బిల్లు కట్టామంటూ ఆవేదన

అయితే, ఆస్పత్రి బిల్లు రూ. 52 లక్షలు చెల్లించామని, మరో రెండు వారాల్లో డిశ్చార్జ్ కావాల్సి ఉండగా ఇలా జరిగిందని కళ్యాణ్ వాపోయారు. కాగా, భావన మృతిలో వైద్యులు, వైద్య సిబ్బంది వైఫల్యమేమీ లేదని, విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను బతికించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, అయినా ఫలితం లేకపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

కరోనాతో వారంలోనే తల్లిదండ్రులు మృతి.. అనాథలైన కుమార్తెలు

కరోనాతో వారంలోనే తల్లిదండ్రులు మృతి.. అనాథలైన కుమార్తెలు

ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలోని కాప్రా సర్కిల్ పరిధిలోని బృందావన్ కాలనీ ఫేజ్-2లో నివసించే భార్యాభర్తలు కరోనా కాటుకు బలయ్యారు. మే 12న ప్రైవేటు ఉద్యోగి అయిన అయిల సాంబమూర్తి(48) కరోనా బారినపడ్డారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 27న మృతి చెందారు. కాగా, అంత్యక్రియలు, తదితర కార్యక్రమాల క్రమంలో ఆయన భార్య మహిమలత(40) కూడా కరోనా బారినపడ్డారు. ఆమె ఇంట్లోనే మందులను వాడారు. పరిస్థితి విషమించడంతో కుమార్తెలు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మరణించారు. వారం రోజుల్లోనే తల్లిదండ్రులు మరణించడంతో ఇద్దరు కుమార్తెలు సుష్మిత, హర్షిత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్ద కూతురు సుష్మిత డిగ్రీ పూర్తి చేయగా, చిన్న కుమార్తె హర్షిత ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అనాథలుగా మారిన వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

English summary
Rs 52 lakh fee for post covid treatment: A Young lady doctor dies after treatment in a corporate hospital in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X