దగ్ధమైన ఆర్టీసి బస్సు: ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి పొగ రావడంతో ప్రయాణికులు దిగిపోయారు, బైక్‌ను తప్పించబోయి ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగడాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను స్థానికుల సహాయంతో దింపేశాడు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు.

ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. ప్రయాణికులకు ఏ విధమైన అపాయం జరుగలేదు. బస్సు షాద్‌నగర్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదిలావుంటే, రంగారెడ్డి ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ దగ్గర వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఔటర్ రింగ్‌రోడ్డు పిల్లర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని భాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications