TGSRTC: టికెట్ల ధరలపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ..!
ఆర్టీసీపై అసత్య ఆరోపణలు చేయడం పై అసహనం వ్యక్తం చేసింది ఆ సంస్థ. నిజామాబాద్-హైదరాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి ఆ రూట్ లో గరుడ ప్లస్ బస్సు చార్జీ రూ.520 గా ఉండేదని.. దానిని రాజధాని ఛార్జీతో సమానంగా రూ.430కి ఆర్టీసీ యాజమాన్యం తగ్గించిందని గుర్తు చేసింది. కొన్ని నెలలుగా ఈ రెండు రకాల సర్వీసులకు ఒకటే టికెట్ ధర రూ.430 గా ఉందని వివరించింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ చార్జీలనే సంస్థ అమలు చేస్తోంది. టికెట్ ధరలు పెరిగాయనడం అవాస్తవమని పేర్కొంది. దసరా సందర్భంగా కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే కేవలం ప్రత్యేక బస్సుల్లోనే ఛార్జీలు కాస్త పెంచినట్లు ఆర్టీసీ అప్పట్లో ప్రకటించింది. ప్రత్యేక బస్సులు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ వస్తాయని.. డీజిల్ కోసం కాస్త ధర పెంచినట్లు వివరించింది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ ప్రత్యేక బస్సులు నడిపింది. దసరాకు ముందు హైదరాబాద్ నుంచి కరీంనగర్ బస్సు నిండ వెళ్లిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో ఒక్కరు ఇద్దరు మాత్రమే ప్రయాణించారు.

అందుకే కాస్త ధర పెంచినట్ల వివరించింది. అయినప్పటికీ ఆర్టీసీపై అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆ సంస్థ పేర్కొంది. మరోవైపు కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనన్నట్లు ప్రకటించింది. వేములవాడ, ధర్మపురి, కీసగుట్ట, శ్రీశైలంతో పాటు పలు ఆలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ప్రకటించారు. ఆర్టీసీ పనితీరు, కార్తీకమాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి శనివారం వర్చ్‌వల్‌గా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహంచారు.
ఆర్టీసీకి కార్తీక మాసం, శబరిమల ఆపరేషన్స్ ఎంతో కీలకమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్న ప్రకటించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను tgsrtcbus.in వెబ్‌సైట్ సందర్శించాలని కోరారు. మరిన్నీ వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు.












Click it and Unblock the Notifications