ఉచిత ప్రయాణంతో మేడారం మహా జాతరకు పెరిగిన ఆర్టీసీ బస్సులు.. వివరాలివే!
మరికొద్ది రోజులలో మేడారం మహా జాతర ప్రారంభం కాబోతుంది. మేడారం మహా జాతరకు కోట్లాది సంఖ్యలో భక్తులు తరలివచ్చే క్రమంలో జాతర సక్సెస్లో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుంది. జాతరకు వచ్చే భక్తులకు ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తూ ఆర్టీసీ ప్రతి సంవత్సరం కీలకంగా పనిచేస్తుంది. గత జాతరలో 20 లక్షల మంది భక్తులు ఆర్టీసీ ద్వారా మేడారం జాతరకు వెళ్లారు.
మేడారం జాతరకు ఎన్ని వేల బస్సులంటే
ఈ జాతరకు 30 లక్షల మందిని తరలించే లక్ష్యంతో ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇప్పటికే హన్మకొండ, వరంగల్ నుండి మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు ప్రారంభం కాగా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుండి బస్సులు నడపడానికి ఆర్టీసీ సన్నద్ధమైంది. మొత్తం మేడారం మహా జాతరకు నాలుగు వేల బస్సులను నడపనున్నారు. గత జాతరలో 3,500 బస్సులను నడపగా, ఈసారి నాలుగు వేల బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

పూర్తి స్థాయిలో మేడారం జాతరకు బస్సులు అప్పుడే
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండడం వల్ల అదనంగా 500 బస్సులను చేర్చి జాతరకు బస్సులను నడుపుతారు.ఈ బస్సులను కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్లలోని 51 పాయింట్స్ నుంచి నడుపుతారు. ఈనెల 25వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సులు నడుపుతున్న క్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా ప్రయాణికులు ఈసారి మేడారం జాతరకు వస్తారని అంచనా వేస్తున్నారు.
మేడారం జాతరకు 14వేల మంది ఆర్టీసీ సిబ్బంది
మేడారం జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఆర్టీసీకి 4.35 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ నిధులతో మేడారంలో తాత్కాలిక బస్టాండ్, బస, క్యూలైన్లు, టికెట్ కౌంటర్లు, పార్కింగ్ స్థలాలు, క్యాంటిన్లు, సిబ్బంది వసతి, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించుకుంటారు. మొత్తం 14వేల మంది ఆర్టీసీ సిబ్బంది మేడారం జాతరకు వచ్చే భక్తులకు సేవలను అందించనున్నారు. హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు ఉంటాయి కానీ ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం మాత్రం లేదు.
జాతరకు ఆర్టీసీ ఏర్పాట్లు ఇలా
మేడారం మహా జాతరకు ఆర్టీసీ 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తుంది. 20 ఎకరాలలో తాత్కాలిక బస్టాండ్ ను నిర్మిస్తున్నారు. 20 ఎకరాలు పార్కింగ్ కు, తాడ్వాయి వద్ద టికెట్లు జారీకి అదనంగా ఆరు ఎకరాలు కేటాయించారు. ట్రాఫిక్ పెరిగితే కామారం ప్రాంతంలో మరో 15 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. దీనిని ఈనెల 23వ తేదీన ప్రారంభించనున్నారు. మేడారం ప్రయాణ ప్రాంగణంలో 52 క్యూలైన్లను ఏర్పాటు చేస్తారు.
మేడారం జాతరకు 15 మొబైల్ బృందాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 25 తాత్కాలిక ప్రయాణ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు. బస్సులు మొరాయిస్తే వాటి మరమ్మత్తులకు మేడారం, తాడ్వాయి, పస్రా, గట్టమ్మ వద్ద మూడు చోట్ల నాలుగు క్యాంపు లలో మెకానిక్లు అందుబాటులో ఉంటారు. మేడారం జాతరకు అదనంగా 15 మొబైల్ బృందాలు పనిచేస్తాయి. ఒక బృందంలో మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఇద్దరు సిబ్బంది ఉంటారు.
గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా ఏర్పాట్లు
బస్సుల స్థితిని వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా బస్సులు ఆగిపోతే వాటిని తరలించడానికి రెండు క్రేన్లను, ఐదు ట్రాక్టర్లను సిద్ధం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు సుఖవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించడానికి కృషి చేస్తుందని వరంగల్ ఆర్ఎం డి విజయభాను అన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications