TSRTC: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ కీలక ప్రకటన.. అలా అయితేనే ఫ్రీ అంటూ స్పష్టం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పోస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకుంటే మహిళలు గుర్తింపు కార్డు చూపించారు. అయితే చాలా మంది జిరాక్స్ లు చూపిస్తున్నారు. దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా పలు సూచనలు చేశారు. జిరాక్స్ కాపీలు కాకుండా ఒరిజినల్‌ గుర్తింపు పత్రాలు చూపించాలని స్పష్టం చేశారు.

ఒరిజినల్ గుర్తింపు కార్డులను చూపించాలని పదేపదే చెబుతున్నప్పటికీ కొంతమంది తమ స్మార్ట్ ఫోన్‌ల ఫొటోకాపీలు, కలర్ జిరాక్స్‌లను చూపిస్తున్నారని పలువురు కండక్టర్లు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సజ్జనార్ ఒరిజినలు చూపించాలని స్పష్టం చేశారు. జిరాక్స్ చూపించడం వల్ల సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు.

 RTC MD Sajjanar said that women should show their original ID card to travel free of charge in RTC.

మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల మహిళలు మాత్రం డబ్బు చెల్లించి విధిగా టికెట్ తీసుకుని, తమకు సహకరించాలని సజ్జనార్ కోరారు. అడ్రస్ ప్రూఫ్ లేని పాన్ కార్డును ఉచిత ప్రయాణానికి ఉపయోగించలేరని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులు కచ్చితంగా స్పష్టమైన ఫోటో, అడ్రస్ ఉండాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చెల్లిబాటు అవుతుందన్నారు. పాన్ కార్డుకు చిరునామా లేనందున ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని సజ్జనార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. జారీ చేసిన జీరో టిక్కెట్ల సంఖ్య ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఆర్‌టీసీకి డబ్బు ఇస్తుందని సజ్జనార్ వివరించారు. మహిళలు జీరో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే సంస్థకు నష్టమని, కావున ప్రతి మహిళ కూడా జీరో టికెట్ తీసుకోవాలని సజ్జనార్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+