కడప జిల్లా పరిషత్ సమావేశం రచ్చ రచ్చ
హైదరాబాద్: కడప జిల్లా పరిషత్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్రతి ఏడాది రూ. 50 కోట్ల నిధులు మంజారు చేస్తోంది. ఈ నిధులను తెలుగుదేశం పార్టీ నేతలు దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టించారని అనడంతో తెలుగుదేశంపార్టీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడ్డుచెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు తోపులాట జరిగే ఉద్రిక్తత పరిస్థితి తలెత్తడంతో జెడ్పీ ఛైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications