ఆఫ్రికా స్త్రీ హత్య: భార్య శవాన్ని రూపేష్ 16 ముక్కలుగా నరికాడు (ఫొటోలు)

హైదరాబాద్: భార్య సింథియాను హత్య చేసిన రూపేష్ వ్యవహారంలో మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రూపేష్ తన భార్య సింథియాను హత్య చేసి శవాన్ని ముక్కలుగా చేసి శంషాబాద్ ప్రాంతంలోని మదనపల్లి వద్ద నిర్మానుష్యమైన ప్రదేశంలో తగులపెట్టి పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే.

భార్యను హత్య చేసిన రూపేష్ ఆమె శవాన్ని 16 ముక్కలుగా కోసినట్లు విచారణలో తేలింది. ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాలను శంషాబాద్‌ డీసీపీ సన్‌ప్రీతసింగ్‌ మీడియాకు వెల్లడించారు.

ఫ్రాన్స్‌కు చెందిన వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం వల్లనే భార్యను సింథియాను రూపేష్ చంపినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, కూతురు సానియాను కూడా తీసుకుని వెళ్తానని సింథియా పట్టుబట్టింది. అందుకు రూపేష్ అంగీకరించలేదు. షేర్ మార్కెట్లో నష్టాలు, భార్య గొడవలతో మానసిక స్థితి దెబ్బతిన్న పరిస్థితిలో ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.

రూపేష్‌ది ఆగ్రా

రూపేష్‌ది ఆగ్రా

నిందితుడైన 36 ఏళ్ల రూపేశ్‌కుమార్‌ మోహనాని స్వస్థలం ఆగ్రా. కొన్ని దశాబ్దాల క్రితమే వ్యాపార రీత్యా అతడి కుటుంబం హైదరాబాద్‌ చేరింది. ఇక్కడే రూపేశ్‌ ఇంటర్‌ వరకు చదివాడు. 1999లో ఉద్యోగంలో భాగంగా కాంగో వెళ్లాడు. డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో సేల్స్‌మ్యాన్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు.

ఇలా హైదరాబాద్ తిరిగి వచ్చాడు...

ఇలా హైదరాబాద్ తిరిగి వచ్చాడు...

రూపేష్ 2003లో తిరిగి హైదరాబాద్‌ వచ్చాడు. తిరిగి రెండు నెలల్లోనే కాంగోకు పయనమయ్యాడు. సెలవులను సరదాగా గడిపేందుకు అక్కడి మలిబు క్లబ్‌కు వెళ్లేవాడు. ఆ క్రమంలోనే క్లబ్‌లో డాన్సర్‌గా పనిచేసే సింథియా(30)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. రెండేళ్ల ప్రేమ తర్వాత 2008లో ఇద్దరు చర్చిలో పెళ్లి చేసుకున్నారు.

అక్కడే పాప...

అక్కడే పాప...

రూపేష్, సింథియా దంపతులకు సానియా (10) పుట్టింది. నాలుగేళ్ల క్రితమే భార్య, కూతురుతో కలిసి మళ్లీ హైదరాబాద్ నగరానికి వచ్చేశాడు రూపేశ్‌. గచ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌ తీసుకుని వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ వచ్చారు. రూపేశ్‌కు వ్యాపారంలో నష్టాలొచ్చాయి.

వజ్రాల వ్యాపారితో...

వజ్రాల వ్యాపారితో...

విలాసవంతమైన జీవితం గడిపిన భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌కు చెందిన కినౌనికమటబు అనే వజ్రాల వ్యాపారి ఫేస్‌బుక్‌లో సింథియాకు పరిచయమయ్యాడు. అతడితోనే గంటల తరబడి ఆమె చాటింగ్‌ చేస్తుండడంతో రూపేశ్‌ పదే పదే హెచ్చరించాడు. అయినా వినలేదు.

ప్లాన్ ప్రకారమే హత్య...

ప్లాన్ ప్రకారమే హత్య...

ప్లాన్‌ ప్రకారం ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సింథియాను గొంతు నులిమి చంపేశాడు రూపేశ్‌. ఉదయం సానియాను యథా ప్రకారం స్కూలుకు పంపాడు. స్కూల్లో దించి ఇంటికి వచ్చే సమయంలో రెండు కత్తులు, గొడ్డలి, సుత్తిని కొని తెచ్చాడు. చచ్చిపోయిన భార్యను 16 ముక్కలుగా నరికాడు.

పెద్ద సూట్‌కేసులో శవం ముక్కలు

పెద్ద సూట్‌కేసులో శవం ముక్కలు

ఓ పెద్ద సూట్‌కే్‌సలో భార్య సింథియా మృతదేహం భాగాలను పెట్టి కారును అద్దెకు తీసుకొచ్చాడు. చెత్తను తగులబెట్టేసొద్దామంటూ కూతురు సానియాను తీసుకుని సోమవారం రాత్రి శంషాబాద్‌ మండలం మదన్‌పల్లి సమీపంలో మృతదేహాన్ని బయటపడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

ఇలా పట్టుబడ్డాడు...

ఇలా పట్టుబడ్డాడు...

శవం ముక్కలకు నిప్పంటించి వచ్చిన కారులోనే రూపేష్ తిరిగి ఇంటికి బయల్దేరాడు. అయితే కొద్ది దూరం వెళ్లగానే కారుటైర్లు బురదలో చిక్కుకున్నాయి. ఆ ప్రదేశంలో మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. రూపేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు నిందితుడు ఉపయోగించిన మారణాయుధాలను అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

భార్య శవాన్ని రూపేష్ 16 ముక్కలుగా నరికాడు (ఫొటోలు)

భార్య శవాన్ని రూపేష్ 16 ముక్కలుగా నరికాడు (ఫొటోలు)


రూపేష్ తన భార్య సింథియాను హత్య చేసి ఆమె శవాన్ని 16 ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత వాటిని ఓ భారీ సూట్‌కేసులో కుక్కి, శంషాబాద్ సమీపంలో దగ్ధం చేయడానికి ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+