సైదాబాద్ బాలిక అత్యాచారం, హత్య: నిందితుడి అరెస్ట్, పోస్టుమార్టం రిపోర్టులో తేలిన ఘోరం
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాల్లో అరెస్ట్ చేశారు. రాజు స్వగ్రామం అడ్డగూడూరులో అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలికల అనుమానాస్పద రీతిలో శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం లభ్యమవడంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. తూర్పు మండలం డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, బాలిక మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి చిన్నారిని హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులుకు అప్పగించారు.
నిందితుడు రాజు గురువారం సాయంత్రం బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పరుపులో మూటకట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు, స్థానికులు బాలిక కోసం వెతకగా.. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానం వచ్చి రాజు ఇంటిని పరిశీలించగా బాలిక శవమై కనిపించింది. అనంతరం బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసిన రాజును కాల్చి చంపాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
మరోవైపు ఆందోళనకారుల వద్దకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, డీసీపీ రమేశ్ రెడ్డి వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరపున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, డబుల్ బెడ్ రూం ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని బాధిత కుటుంబానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా నిందితుడికి జైలు శిక్ష పడేలా చేస్తామన్నారు.
ఈ ఘటన జరగడం దురదృష్టమని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి అన్నారు. పాప డెడ్ బాడీ తరలించే టైంలో పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. పాప డెడ్ బాడీకి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం జరుగుతోందని తెలిపారు. మరో రెండు గంటల్లో నిందితున్ని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి తొందరగా శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. మరోవైపు చిన్నారి ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
ఇది ఇలావుండగా, ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యపై రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాలిక కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణం రూ.50వేల ఆర్ధిక సాయం ప్రకటించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్లతో మాట్లాడారు మంత్రి సత్యవతి రాథోడ్. తగిన చర్యలు తీసుకోవాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. దోషులు ఎంతటివారైన ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications