మళ్లీ అదే డైలాగ్.!కొంచెం కూడా మార్పు లేదు.!తెలంగాణ ప్రజలను మరొక్కసారి నవ్వించిన బండి సంజయ్.!

హైదరాబాద్ : జన జాగరణ కార్యక్రమం ద్వారా వినూత్న పరిస్థితులను ఎదుర్కొన్న బీజేపి తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ కరీం నగర్ జైలు నుండి విడుదలైన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పైన ఎప్పటిలాగే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మీద ఎలాంటి విమర్శలు చేసారో అవే విమర్శలు చేసారు. కాగా బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల మొదట్లో బీజేపి కార్యకర్తలే కాకుండా, ప్రజల నుండి అనూహ్య స్పందన వ్యక్తం అయ్యింది. కానీ బండి సంజయ్ అవే వ్యాఖ్యలు మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తుండడంతో తెలుగు ప్రజలు అవాక్కవుతున్నారు.

రోటీన్ గా బండి సంజయ్ ఉపన్యాసం.. హాస్యంగా మారిని సీరియస్ కామెంట్స్

రోటీన్ గా బండి సంజయ్ ఉపన్యాసం.. హాస్యంగా మారిని సీరియస్ కామెంట్స్

తెలంగాణ బీజేపి అద్యక్షుడు తెలుగు ప్రజలను మళ్లీ ఆశ్చర్యానికి గురి చేసారు. తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం చంద్రశేఖర్ రావుపై గతంలే చేసిన ఘాటు వ్యాఖ్యలనే మళ్లీ వల్లె వేసారు. అనూహ్య స్పందన తెలిపిన బీజేపి కార్యకర్తలు ఈ సారి ఆశ్చర్యాన్ని, అయోమయాన్ని వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పైన ఎన్ని సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని కార్యకర్తలు తమలో తాము నవ్వుకుంటున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ వందసార్లు అదే మాట అంటున్నప్పటికీ ఎప్పటికి ఆచరణలోకి వస్తుందని తమలో తాము ప్రశ్నించుకుంటున్నట్టు సమాచారం.

ఎప్పుడూ అవే వ్యాఖ్యలా..?అసహనం వ్యక్తం చేస్తున్న కమలనాధులు

ఎప్పుడూ అవే వ్యాఖ్యలా..?అసహనం వ్యక్తం చేస్తున్న కమలనాధులు

సీఎం చంద్రశేఖర్ రావు పైన బండి సంజయ్ వ్యాఖ్యలు మీరు వినండి, నేను చెప్పేస్తాను అనే చందంగా ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆధారాలు ఉంటే పకడ్బందీగా వ్యవహరించాలి గానీ ఇలాంటి సాగదీత ఆరోపణలు ఎంటనే చర్చ జరుగుతోంది. సీఎం చంద్రశేఖర్ రావు పైన చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించి యాక్షన్ లోకి దిగాలి గానీ రెండేళ్ల నుండి చెప్పిందే చెప్పి జనాలను విసిగిస్తున్నారనే కొత్త చర్చ కూడా తెలంగాణలో తెరమీదకు వస్తోంది. బండి సంజయ్ చేసిన తాజా ఆరోపణలపై సొంత పార్టీలో అచ్చం ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి.

కేసీఆర్ పైన ఘటు వ్యాఖ్యలు.. అవాక్కవుతున్న పార్టీ శ్రేణులు

కేసీఆర్ పైన ఘటు వ్యాఖ్యలు.. అవాక్కవుతున్న పార్టీ శ్రేణులు

రాజకీయ ఆరోపణలు, విమర్శలు తాత్కాలిక హడావిడి చేయడానికి పనికొస్తాయి తప్ప పార్టీకి దీర్గకాలిక ప్రయోజనాలు ఉండవని బండి చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. అధికార పార్టీపైన, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పైన చేస్తున్న ఆరోపణలు గానీ, విమర్శలు గాని కొంత కాలం వరకూ రసవత్తరంగా ఆస్వాదిస్తారు జనం. తర్వాత అవే డైలాగ్ లు బోర్ కొట్టి అసహనం వ్యక్తం చేస్తారు. చప్పట్లు, ఈలలు, కేరింతలు కొట్టిన వాళ్లే ఏంటీ ఈ గోల అనే పరిస్థితికి చేరుకుంటారు. అచ్చం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్.

మళ్లీ కేసీఆర్ ను జైలుకు పంపుతామన్న బండి సంజయ్.. చెవులు మూసుకుంటున్న కార్యకర్తలు

మళ్లీ కేసీఆర్ ను జైలుకు పంపుతామన్న బండి సంజయ్.. చెవులు మూసుకుంటున్న కార్యకర్తలు

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుపై బండి సంజయ్ సీరియస్ గా చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాన్ని పండిస్తున్నాయి. జైలుకు వెళ్లక ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేసారో కరీం నగర్ జైలునుండి విడుదలైన తర్వాత కూడా అవే వాఖ్యలు చేసారు. తెలంగాణ సీఎం అవినీతి చిట్టా విప్పుతున్నాం, త్వరలో జైలుకు పంపుతామనే రొటీన్ డైలాగ్ ను మళ్లీ వినిపించారు బండి సంజయ్. దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా అవాక్కవుతున్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రజలను రంజిపజేయడానికి, కార్యకర్తల్లో ఉత్సాహం నిపండానికి బండి సంజయ్ గత రెండు సంవత్సరాలుగా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారని, చంద్రశేఖర్ రావును జైలుకు పంపుడేమో గానీ, ఎలాంటి ఆర్భాటం లేకుండా చంద్రశేఖర్ రావు మాత్రం బండి సంజయ్ ని ఓ సారి జైలుకు పంపాడని, యాక్షన్ తీసుకుంటే అలా ఉండాలి గానీ, మాటి మాటికి ఈ జైలు ప్రకటనలు ఏంటని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+