మంత్రి అనుచరుడి రాసలీల?: రూ.5 కోట్ల ప్రియురాలి భూమి కబ్జా, విడాకులిచ్చిన భర్త!
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని సనత్ నగర్‌లో ఓ నాయకుడు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆమె ఆస్తి పైన కన్నేసి, ఆ ప్రియురాలి భర్తను బెదిరింపులకు గురి చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సదరు నాయకుడి బెదిరింపుతో ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు. సదరు నాయకుడు ఓ మంత్రి అనుచరుడిగా వార్తలు వస్తున్నాయి.
సనత్ నగర్ డివిజన్‌కు చెందిన సదరు నాయకుడు ఓ మహిళతో రాసలీలలు నడుపుతున్నాడు. అంతేకాదు, ఏకంగా ఆమెకు చెందిన రూ.5 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేశాడని తెలుస్తోంది. దీంతో ఆ మహిళ భర్త నిలదీశాడు. అయితే, అతనిని చంపేస్తానని బెదిరించాడని తెలుస్తోంది.

సదరు నాయకుడి నిర్వాకంతో ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడని తెలుస్తోంది. అనంతరం తన ఆస్తి విషయమై, తనకు వచ్చిన బెదిరింపుల విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు ప్రాణ హానీ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications