రాజయ్యకు మనవడి సెంటిమెంట్!: టెక్కీ... పిఎఫ్ డబ్బులతో నెట్టుకొచ్చిన సారిక
వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య సెంటిమెంట్ కారణంతోనే తన మనవడు అభినవ్‌ను పిలిపించుకున్నాడని తెలుస్తోంది. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో... కాంగ్రెస్ పార్టీ తొలుత రాజయ్యను అభ్యర్థిగా ప్రకటించింది.
ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, పార్టీ అధిష్టానం తనను అభ్యర్థిగా ప్రకటించడంతో రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు రోజు... తన మనవడు అభినవ్‌ను పిలిపించుకున్నట్లుగా స్కూల్ యాజమాన్యం చెబుతోందని తెలుస్తోంది.
అభినవ్ అంటే రాజయ్యకు ఇష్టమని, గతంలో ఎంపీగా గెలిచినప్పుడు కూడా అభినవ్ చేతితో నామినేష్ తీసుకు వెళ్లినందున అదే సెంటిమెంటుతో ఈసారి పిలిపించారని తెలుస్తోంది.

మరోవైపు, సారిక సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. తాను టెక్కీగా పని చేసినప్పుడు పిఎఫ్‌గా వచ్చిన డబ్బుతోనే కిరణా సరుకులు, బియ్యం కొనుగోలు చేసుకునేదని తెలుస్తోంది. మూడు నెలల క్రితం ఆ డబ్బులు కూడా అయిపోయాయని, దీంతో తన బంగారం అమ్మేసిందని, పాత మిత్రుల సహకారంతో వెళ్లదీశారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, రాజయ్య కొడుకు అనిల్‌కు రెండో పెళ్లి చేసింది సారిక అత్తనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. అనిల్.. సనను రెండో పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అత్తనే సనతో పెళ్లి చేసిందని తెలుస్తోంది. రెండో భార్యకు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారని సమాచారం.












Click it and Unblock the Notifications