ఇకపై తెలంగాణలోవారానికి ఐదు రోజులే స్కూల్స్..??

ప్రస్తుతం తెలంగాణలో నీటి కొరత, ఎల్ నినో కారణాల దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలోని స్కూళ్లకు వారానికి 5 రోజులే పనిదినాలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తాజాగా లేఖ రాశారు. రానున్న రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో ఏర్పడనున్న నీటి కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని స్కూల్స్ అన్నింటినీ సోమవారం నుంచి శుక్రవారం వరకే నడపాలని ఈ మేరకు ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అయితే శనివారం సెలవు వల్ల విద్యార్థుల స్టడీ దెబ్బతినకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 35 నుంచి 40 నిమిషాల పాటు స్కూల్ వేళలను పెంచాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎల్ నినో వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ముందుజాగ్రత్త చర్యలుగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రతి శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలా వారంలో ఒక వర్కింగ్ డే తగ్గించడం వల్ల పాఠశాలల్లో తాగునీటిని పొదుపు చేయడం అలాగే సాధారణ నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని అన్నారు. దాంతోపాటు ఫ్యాన్లు, లైట్లు, డిజిటల్ బోర్డులు, ఇతర స్కూల్ సదుపాయాల వాడకం తగ్గి విద్యుత్ కూడా ఆదా అవుతుందని లేఖలో స్పష్టం చేశారు.

Schools in Telangana MLC Malka Komaraiah written a letter to CM Revanth requesting 5 day work news

మరోవైపు శనివారం సెలవు దినంగా ప్రకటించడం కారణంగా రాకపోకలు తగ్గిపోయి రోడ్లపై ట్రాఫిక్ రద్దీతో పాటు వాహన కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, శాసనమండలి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పాఠశాల విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకుని కోలుకోవడానికి అదనపు సమయం లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ సర్కార్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అనేది ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+