Mahakumbh Mela 2025: మరో నాలుగు ప్రత్యేక రైళ్లు - షెడ్యూల్..!!

Mahakumbh Mela 2025: మహాకుంభ మేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మౌని అమావాస్య కావటంతో పుణ్య స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఇప్పటికే 15 కోట్ల మంది వరకు భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వచ్చినట్లు చెబుతున్నారు. ఒకటో తేదీ నుంచి ప్రముఖులు కుంభ్ మేళాకు రానున్నారు. ఇక, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. ఇప్పుడు అదనంగా మరో నాలుగు రైళ్లను రైల్వే అధికారులు ఖరారు చేసారు.

కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. దీంతో, రైల్వే .. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో రెండు ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 5, 7 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్‌కు ఏర్పాటు చేసారు. అదే విధంగా ఫిబ్రవరి 7,9 తేదీల్లో మరో రెండు రైళ్లు తిరుగు ప్రయాణంలో దానాపూర్‌ నుంచి చర్లపల్లి వచ్చేలా షెడ్యూల్ ప్రకటించారు.

SCR Announces four more special trains from Cherlapalli to Maha Kumbh in next month

చర్లపల్లి నుంచి దానాపూర్ కు వెళ్లే మార్గంలో ఖాజీపేట్‌, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బలార్ష, చంద్రాపూర్‌, సేవాగ్రమ్‌, నాగ్‌పూర్‌ స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లకు హాల్ట్‌ ఏర్పాటు చేసారు. ఫిబ్రవరి 26 తో కుంభమేళా ముగియనుంది. ప్రత్యేక రైళ్లలోనూ రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో, భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు ఆర్టీసీ సైతం ప్యాకేజీలు ప్రకటించింది. ఎవరైనా 30 మంది భక్తు లు ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు వస్తే కోరిన కేటగిరీలో బస్సులు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది. దీంతో, ఫిబ్రవరి తొలి వారంలో తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లే వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+