తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు !!
తెలంగాణలో మళ్లీ ఎన్నికల యుద్ధం జరగనుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇక ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రాజకీయాలను యాక్టివ్ చేశాయి. హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించి తొలి స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు రెండో స్థానాన్ని దక్కించుకోగా.. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా ఇప్పుడు రాష్ట్రంలో మరో కీలక ఎన్నికలకు రంగం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు..
కాగా పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి ప్రారంభమై జనవరి 10లోపు పూర్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 1న మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారికంగా విడుదల చేయనున్నారు.

అలానే ముసాయిదా ఓటర్ల జాబితాపై ప్రజలు, రాజకీయ పార్టీలు అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు అవకాశం కల్పించనున్నారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం జనవరి 10న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఈ తుది జాబితానే రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు ఆధారంగా ఉండనుంది. జనవరిలో ఓటర్ల జాబితా ఖరారైన వెంటనే, ఫిబ్రవరిలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు..
ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న ప్రధాన కార్పొరేషన్లలో కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, రామగుండం పట్టణాల్లో రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఫిబ్రవరి నెలలో తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఎన్నికల కోలాహలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికైన కొత్త సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కాకుండా పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొంచెం ఢీలా పడ్డ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో అయిన సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications