సికింద్రాబాద్- విశాఖ రైలు ప్రయాణికులకు గమనిక.. !!
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే దురంతో ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచనలు చేశారు. ప్రయాణికులు కోరుకున్నట్లుగా ఈ రైలు బోగీల కూర్పులో మార్పులు చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ కూర్పు అమలులోకి వస్తుంది. ఈ మార్పులు ఇక శాశ్వతం. ఇవి మొత్తం రెండు దశలుగా అమలులోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు లేదా శాశ్వత ప్రాతిపదికన కొనసాగుతాయి.
ప్రయాణికుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని 22204/22203 విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ల కూర్పును శాశ్వత ప్రాతిపదికన సవరించాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్పులు రెండు దశల్లో అమలు కానున్న ఈ మార్పులకు మార్చి 25వ తేదీన శ్రీకారం చుట్టనున్నారు. తాత్కాలిక కూర్పు మార్చి 25 నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

నంబర్ 22204 సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో మార్చి 25 నుండి ఏప్రిల్ 22 వరకు, నంబర్ 22203 విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో మార్చి 26 నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు సవరించిన కూర్పుతో నడుస్తాయి. ఈ తాత్కాలిక కూర్పులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి: ఫస్ట్ ఏసీ- 1, 2ఏసీ- 4, 3ఏసీ- 12, స్లీపర్ బోగీలు- 3, దివ్యాంగులు- 2 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు వీటికి అందుతున్న ప్రయాణికుల ఆదరణ గురించి తెలుసుకుంటారు.
అనంతరం అదే నెల 25వ తేదీ నుండి ఈ రైళ్లు శాశ్వత ప్రాతిపదికన సవరించిన కూర్పుతో నడుస్తాయి. నంబర్ 22204 సికింద్రాబాద్- విశాఖపట్నం దురంతో ఏప్రిల్ 25 నుండి, నంబర్ 22203 విశాఖపట్నం- సికింద్రాబాద్ ఏప్రిల్ 26 నుండి కొత్త కూర్పును కలిగి ఉంటాయి. ఈ శాశ్వత కూర్పులో మొత్తం 21 కోచ్‌లు ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఏసీ- 1, 2ఏసీ- 4, 3ఏసీ- 14, దివ్యాంగులు- 2 కోచ్‌లు ఉంటాయి. వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె పవన్ కుమార్ ఆ వివరాలను వెల్లడించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications