వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సకాలంలో పనులు చేయకుంటే చర్యలు తప్పవు : సీతారామ ప్రాజెక్టు గుత్తేదారుపై స్మితా ఫైర్

|
Google Oneindia TeluguNews

భద్రాద్రి కొత్తగూడెం : సాగునీటి ప్రాజెక్టుల్లో ఆలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టంచేశారు సీఎంవో ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనుల ఆలస్యంపై ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇవాళ పనుల తీరును ఆమె పరిశీలించారు. అయితే ప్రాజెక్టు పనులు ప్రణాళిక ప్రకారం జరుగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడంపై మండిపడ్డారు. అక్కడే ఉన్న పాజెక్టు గుత్తేదారు, కంపెనీ ప్రతినిధులు, అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదన్ననారు. సకాలంలో పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

seetharama project work slow

జాప్యం ఎందుకు ?
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ క్రమంలో పనుల ఆలస్యం సరికాదన్నారు స్మిత సబర్వాల్. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుంటే .. సీతారామలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. వెంటనే పనులు స్పీడప్ పెంచాలని సూచించారు. నిర్దేశిత సమయంలోపు ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని తేల్చిచెప్పారు.

English summary
CMO Special Officer, Smita Sabarwal, said, "We will be able to see if there is a delay in irrigation projects. Strict measures are being taken. Seetharama expressed concern over delay in project work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X