డీ శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత: సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరిక, అరవింద్ ట్వీట్
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) సోమవారం అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. తన నివాసంలో అనారోగ్యానికి గురికావడంతో ఆయనను బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఫిట్స్ రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం డీఎస్ ఆరోగ్య పరిస్థితిపై వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.

తన తండ్రి డీ శ్రీనివాస్ కు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని.. ఈ కారణంగా రెండు రోజులపాటు తన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన తనయుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
— Arvind Dharmapuri (@Arvindharmapuri) February 27, 2023
కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను. pic.twitter.com/Z043QOGu9f
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన డీ శ్రీనివాస్.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఆయన క్రియాశీలంగా లేరనే చెప్పాలి. ఇందుకు ఆరోగ్య సమస్యలే కారణంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications