Venu swamy.. వివాదాలకు కేరాఫ్ వేణు స్వామికి భారీ షాక్!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి మహిళా కమీషన్ మరోమారు నోటీసులు జారీ చేసింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితంపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని, నిశ్చితార్ధం చేసుకున్న మహిళను కించపరిచేలా, అవమానించేలా ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నవంబర్ 14న విచారణకు రావాలని మహిళా కమీషన్ నోటీసులలో పేర్కొంది

కోర్టు స్టే ఎత్తివేయటంతో వేణు స్వామికి నోటీసులు
గతంలో ఆగస్టు నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే వేణు స్వామి మహిళా కమీషన్ ముందు కాజరు కాలేదు. కోర్టును ఆశ్రయించిన ఆయన కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా వేణు స్వామి పిటీషన్ పై స్టే ఎత్తివేస్తూ కోర్టు వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్ళీ మహిళా కమీషన్ రంగంలోకి దిగింది.

Shock for astrologer venuswamy Telangana Women Commission again sent notices to Venu Swamy

వేణు స్వామి నాగ చైతన్య, శోభితలపై వివాదాస్పద వ్యాఖ్యలు
వేణు స్వామికి రెండోసారి విచారణకు రావాలని నోటీసులను పంపింది. ఇక గతంలో నాగచైతన్య శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం తర్వాత వారి వివాహ జీవితంపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. వారు కలిసి ఉండరని, 2027లో వారు విడిపోతారని చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వేణు స్వామి పై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

కోర్టును ఆశ్రయించిన వేణు స్వామి
ఇక సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న వేణు స్వామి ఈ వివాదం దెబ్బకు, మహిళా కమీషన్ నోటీసులపై కోర్టు మెట్లు ఎక్కారు. నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఇంకా పెళ్లి కూడా చేసుకోకముందే వాళ్ళు ఎప్పుడు విడిపోతారో చెప్పిన వేణు స్వామి గతంలోనూ అనేక సందర్భాల్లో తప్పుడు జ్యోతిష్య విశ్లేషణలు చెప్పి అభాసు పాలయ్యారు.

అందరికీ షాక్ ఇచ్చిన వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి చంద్రబాబు గెలిచిన తర్వాత మళ్లీ తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పనని పేర్కొన్న వేణు స్వామి ఆ మాటను తుంగలో తొక్కారు. నాగచైతన్య శోభిత దూళిపాళ్ల విషయంలో చేసిన వ్యాఖ్యలతో షాక్ అయిన వారు ఆయన పైన తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నీరెళ్ల శారదకు ఫిర్యాదు చేశారు.

నవంబర్ 14వ తేదీన మహిళా కమీషన్ ముందుకు వేణు స్వామి
దీంతో నోటీసులు జారీ చేయటం, ఆయన కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవటం జరిగాయి. ఇక తాజాగా కోర్టు ఆదేశాలతో నవంబర్ 14వ తేదీన మహిళా కమీషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద సమన్లు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+