మద్యం ప్రియులకు మళ్లీ షాక్.. రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్
మద్యం ప్రియులకు మళ్లీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మళ్లీ మరో రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నట్టు తెలిపింది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదని, కొన్ని జిల్లాలలో మాత్రమేనని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అసలు ఇంతకీ ఏ ఏ జిల్లాలలో మద్యం షాపులు మూసి వేయనున్నారు? అందుకు కారణం ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే..
రేపు సాయంత్రం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం క్లోజ్
తెలంగాణ రాష్ట్రంలో మే 27వ తేదీన సోమవారం వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఇప్పటికే సర్వం సిద్ధమైంది. వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో రేపు సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుండగా ఆపై సైలెంట్ పీరియడ్ ప్రారంభం కాబోతుంది.

రేపు సాయంత్రం నుండి సోమవారం సాయంత్రం వరకు వైన్స్ బంద్
ఈ క్రమంలో రేపు మే 25న సాయంత్రం నాలుగు గంటల నుండి మే 27 సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలలో మాత్రమే మద్యం దుకాణాలను, బార్ లను బంద్ చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను లిక్కర్ తో ప్రభావితం చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు .
ఎమ్మెల్సీ పల్లా ఎమ్మెల్యే కావటంతో అక్కడ ఉపఎన్నిక
ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది.
ప్రధాన పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచార హోరు
ఈ ఉపఎన్నికకు ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బిజెపి నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగి ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు.
మూడు జిల్లాలలో లిక్కర్ షాపులు బంద్
ఇక రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో అన్ని పార్టీలలోనూ టెన్షన్ కనిపిస్తుంది. విద్యావంతులైన పట్టభద్రులు ఎవరిని ఆదరిస్తారో తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈ మూడు జిల్లాలలోనూ లిక్కర్ షాపులు బంద్ చేయనున్నారు. తిరిగి సోమవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత వైన్ షాపులు, బార్లు తెరుచుకోనున్నాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications