ఓటుకు నోటు:, ఆధారాలున్నాయన్న తెలంగాణ, సుప్రీం కోర్టులో మత్తయ్యకు షాక్
ఓటుకు నోటు కేసులో మత్తయ్య పాత్ర పైన ఆధారాలు ఉన్నాయని, ఆయన పేరును తొలగించడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సోమవారం నుంచి విన్నవించింది.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మత్తయ్య పాత్ర పైన ఆధారాలు ఉన్నాయని, ఆయన పేరును తొలగించడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సోమవారం నుంచి విన్నవించింది. అనంతరం మత్తయ్య తరఫు న్యాయవాదికి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఓటుకు నోటు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇందులో మత్తయ్య పాత్ర పైన ఆధారాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించి, ఛార్జీషీట్ దాఖలు చేసింది. దీనిపై మత్తయ్య హైకోర్టుకు వెళ్లారు. ఆయన పేరును ఛార్జీషీట్ నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు గడప తొక్కింది. మత్తయ్య పైన ఆధారాలు ఉన్నాయని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఛార్జీషీటులో ఆయన పేరును తొలగించాలనడం సరికాదని తెలిపింది. మత్తయ్య తరఫు న్యాయవాది నాలుగు వారాల గడువు కోరారు. వారంలో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications