స్టీఫెన్‌కు షాక్: కోర్టును తప్పుదోవ పట్టించారు, ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు
హైదరాబాద్: న్యాయమూర్తిని మార్చాలన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం నాడు కొట్టి వేసింది. ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య. ఆయన కొద్ది రోజుల క్రితం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు పైన స్టే విధించాలని, తనను కేసు నుండి తప్పించాలని కోరారు.
దీనిని స్టీఫెన్ సన్ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన హైకోర్టు స్టీఫెన్ సన్ పిటిషన్ కొట్టివేసింది. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్టీఫెన్ సన్ కోర్టును తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించింది. కేసు విచారణ అదే బెంచ్‌లో కొనసాగుతుందని తెలిపింది.

స్టీఫెన్ సన్ పైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మత్తయ్య కౌంటర్ దాఖలు చేసిన అనంతరం హైకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. స్టీఫెన్ సన్ పైన కోర్టు ధిక్కారు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించడం గమనార్హం.
స్టీఫెన్ సన్ పైన కేసు నమోదు చేయాలని హైకోర్టు బెంచ్ ఆదేశించింది. పారదర్శకత కోసం మత్తయ్య కేసు విచారణ వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. విచారణ సమయంలో అడ్వోకేట్ జనరల్, పబ్లిక్
ప్రాసిక్యూటర్, ఇతర సీనియర్ న్యాయవాదులు ఉండాలని న్యాయయమూర్తి ఆదేశించారు. కాగా, సెక్షన్ 15 కింద కోర్టు ధిక్కారణను పరిగణిస్తారు.












Click it and Unblock the Notifications