జీవో 123ని కొట్టేసిన హైకోర్టు: కేసీఆర్‌కు గట్టి షాక్, చూస్తామన్న హరీష్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బుధవారం నాడు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2013 జీవో చట్టానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 123ని హైకోర్టు కొట్టివేసింది.

2013లో కేంద్రం భూసేకరణ చట్టం తీసుకు వచ్చింది. దానిని పక్కన పెట్టిన తెలంగాణ ప్రభుత్వం జీవో 123ని తీసుకు వచ్చింది. దీని ప్రకారం తెలంగాణలో భూసేకరణ జరుపుతున్నారు. అయితే, దీని వల్ల తమకు నష్టం జరుగుతోందని ఇరవై మంది కూలీలు హైకోర్టుకు వెళ్లారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 123ని కొట్టేసింది. జహీరాబాదులో నిమ్జ్ కోసం 12వేల ఎకరాలు, జరాసంఘంలో 2 గ్రామాల్లో భూములు సేకరించారు. మల్లన్న సాగర్ కోసం 7 గ్రామాల్లో భూసేకరణ చేస్తున్నారు. ఈ సేకరణ వల్ల తాము నిరాశ్రయులమవుతున్నామని కూలీలో హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం తీర్పు చెప్పింది.

Shock to KCR: High Court quashes GO 123

హైకోర్టు తీర్పుపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తీర్పు కాపీ వచ్చాక తాము స్పందిస్తామని చెప్పారు. ఇప్పుడు హైకోర్టు బెంచ్ మాత్రమే తీర్పు ఇచ్చింది. ఈ బెంచ్ తీర్పు పైన తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేయనుంది.

మరోవైపు, శ్రీపాద సాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 200 ఎకరాలను సేకరించింది. మరో 200 ఎకరాల్లో భూయజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై హైకోర్టు ఈ రోజు వాదనలు విన్నది. విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court of Andhra Pradesh and Telangana quashed GO 123 on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి