66లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్తను దారుణంగా హతమార్చిన భార్య.. ప్లాన్ చూస్తే మీరే షాకవుతారు!
రియల్ లైఫ్ లో రీల్ లైఫ్ ని మరిపించేలా మహిళా విలన్లు కనిపిస్తున్నారు. సినిమాలలోనే ఆడవాళ్లను దారుణంగా చూపిస్తున్నారు అనుకుంటే, అంతకు మించిన దారుణాలకు మహిళలు పాల్పడుతున్నారు. తాజాగా అటువంటి దారుణ ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ భార్య భర్తను అత్యంత క్రూరంగా హత్య చేయించి, ఆపై దానిని రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేస్తుంది.
అనారోగ్యంగా ఉన్న భర్తపై 66 లక్షల ఇన్సూరెన్స్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నగరానికి చెందిన 52 ఏళ్ల ఆటో డ్రైవర్ చాగంటి రవి కొంతకాలంగా మద్యానికి బానిసై, అనారోగ్యంతో బాధపడుతున్నాడు.భర్త ఆరోగ్యం పాడైందని గుర్తించిన ప్రశాంతి గత సంవత్సరం జూలైలో తన బంధువు శ్రీనివాస్ సహాయంతో రవి పేరుపై 66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని చేయించింది. భర్త మరణిస్తే బీమా సొమ్ము దక్కించుకోవాలి అని ఆమె పథకం వేసింది.

భర్తను హతమార్చాలని ప్లాన్
అయితే రవి ఆరోగ్యం మెరుగుపడటంతో తీవ్ర నిరాశకు లోనైన భార్య బీమా సొమ్మును త్వరగా పొందడం కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. రవిని హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ వేసింది. ఈ ప్రణాళికలో భాగంగా మార్చి రెండవ తేదీన రవిని శ్రీనివాస్ తో పాటు జోగి రాజ్ కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబు మద్యం సేవించడానికి బయటకు తీసుకువెళ్లారు.
మద్యం తాగించి, కార్ తో గుద్దేసి హత్య
రవికి విపరీతంగా మద్యం తాగించిన తర్వాత రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం ఊరి చివర దించేసి ఆ నలుగురు ఆటోలో వెళ్లిపోయారు. మద్యం మత్తులో ఉన్న రవి రోడ్డుపైన నడుచుకుంటూ వెళుతుండగా ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం జోగి రాజ్ కుమార్, వెంకటేష్ కు చెందిన కారుతో రవిని వెనక నుంచి వేగంగా ఢీ కొట్టారు. దీంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హత్య తరువాత నిందితులు తమ స్నేహితులైన సురేష్ ఇంటిదగ్గర కారును దాచిపెట్టి రోడ్డు ప్రమాదంగా నమ్మించడానికి ప్రయత్నించారు. ఇక రోడ్డు ప్రమాదంలో రవి మరణించడంతో ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ప్రశాంతి చెప్పిన వివరాలకు, ఫుటేజీలో ఉన్న దృశ్యాలకు పోలిక కుదరకపోవడంతో తమదైన స్టైల్ లో విచారించారు.
భర్తను హత్య చేయించినట్టు ఒప్పుకున్న భార్య.. ఐదుగురికి రిమాండ్
దీంతో ఆమె బీమా డబ్బుల కోసం తన భర్తను తానే హత్య చేయించినట్లుగా, అందుకు నలుగురు సహాయం తీసుకున్నట్టుగా ఒప్పుకుంది. దీంతో ప్రశాంతితో పాటు, హత్యకు పాల్పడిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఒక కారును, ఒక ఆటోను, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.












Click it and Unblock the Notifications