వామ్మో.. సానుభూతి ఓట్ల కోసం ఏకంగా భర్తనే..!
తెలంగాణలో గ్రామ పంచాయతి ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఇవాళ(డిసెంబర్ 14) రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ప్రస్తుతం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇవాళ 3,911 పంచాయతీలు.. అలాగే 29,917 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 12,834 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలోకి దిగారు. అలాగే 71,071 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అనేకమంది అభ్యర్థులు.. ఓటర్లను పలు విధాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేపట్టి తద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలని పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు. మరికొంతమంది అభ్యర్థులు ఏకంగా తమ కుటుంబ సభ్యులనే ఎరగా వేస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో ఇలాంటి హైడ్రామా ఘటనే జరిగింది. గొల్లపల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త.. సడెన్ గా నిన్న రాత్రి అదృశ్యం అయ్యాడు. అయితే తన భర్తను ప్రత్యర్థి పార్టీవాళ్లు కిడ్నాప్ చేసి హతమార్చారంటూ సబిత గ్రామంలో ప్రచారం చేశారు. ఈ మేరకు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సబిత.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రోన్లు, జాగిలాలతో గాలించి ఎట్టకేలకు సబిత భర్త జనార్ధన్ రెడ్డిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ విచారణ చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో గెలుపు కోసం సబిత, జనార్థన్ రెడ్డి దంపతులు ఈ హైడ్రామా ఆడారని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. సానుభూతి ఓట్ల కోసమే సబిత ఈ నాటకం ఆడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు.

మరో ఘటనలో ఎన్నికల్లో పోటీ చేసిన తన కూతురికి ఓటు వేసిన తండ్రి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 14వ వార్డులో జరిగింది. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.84 శాతం పోలింగ్ నమోదు అయింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications