హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

priyanka reddy: ప్రియాంక రెడ్డి హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఓ మీడియా ఛానల్ ఈ మేరకు కథనాలను ప్రసారం చేసింది. ఈ కేసులు ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

ప్రియాంక రెడ్డి హత్య: పోలీసుల తీరుపై మహిళా జాతీయ కమిషన్ సభ్యురాలి ఆగ్రహంప్రియాంక రెడ్డి హత్య: పోలీసుల తీరుపై మహిళా జాతీయ కమిషన్ సభ్యురాలి ఆగ్రహం

ఆ ఫోన్ కాల్ ఆధారంగానే..

ఆ ఫోన్ కాల్ ఆధారంగానే..

రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ప్రియాంక రెడ్డి ఫోన్ నెంబర్‌ను ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరీఫ్ తీసుకున్నాడు. పావుగంట లేటు కావడంతో ప్రియాంక తన మొబైల్ నుంచి మహ్మద్‌కి ఫోన్ చేసింది. ఈ ఫోన్ కాల్ ఆధారంగానే మహ్మద్‌ను పోలీసులు పట్టుకున్నారు.

బలవంతంగా మద్యం తాగించి..

బలవంతంగా మద్యం తాగించి..

తనను బలవంతంగా ఎత్తుకెళ్లి ఘాతుకానికి పాల్పడుతుండగా.. హెల్ప్ హెల్ప్ అంటూ వేడుకున్నా నిందితులు కనికనించలేదు. బలవంతంగా ఆమెకు మద్యం తాగించి.. ఒకరి తర్వాత ఒకరు నిందితులు దారుణానికి పాల్పడ్డారు. రాత్రి 9.30గంటల నుంచి 40 నిమిషాలపాటు ఈ దారుణకాండను కొనసాగించారు.

మృతదేహాన్ని వదలని కీచకులు

మృతదేహాన్ని వదలని కీచకులు

ఈ ఘాతుకానికి పాల్పడుతున్న సమయంలో ముక్కు, నోరు మూయడంతో ప్రియాంక రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ప్యాంటు లేకుండానే లారీలోకి ఎక్కించారు. ఆ తర్వాత కూడా ఆమె మృతదేహంపై నిందితులు ఒకరి తర్వాత ఒకరు కీచక పర్వాన్ని కొనసాగించారు.

బతికుందనే అనుమానంతో పెట్రోల్ పోసి..

బతికుందనే అనుమానంతో పెట్రోల్ పోసి..

ఆ తర్వాత మళ్లీ కిందికి దిగిన ఓ నిందితుడు ఆమె ప్యాంటును తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని షాద్ నగర్ బ్రిడ్జి కింద పడేశారు. ఆమె బతికుందనే అనుమానంతో నిందితులు మళ్లీ ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పటించారు.

కాగా, లారీలో రక్తపు మరకలు వెంట్రుకలు ఉన్నాయి. రక్తపు మరకలను ఫోరెన్సిక్ బృందం కలెక్ట్ చేసింది. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన పోలీసులు.. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

ఉరితీయాలంటూ..

ఉరితీయాలంటూ..

కాగా, శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని లారీ డ్రైవర్ తోపాటు మరో ముగ్గురు క్లీనర్లు సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. అయితే, నిందితులను వెంటనే ఉరితీయాలని, లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం భారీ ఎత్తున ప్రజలు గుమిగూడి నిరసనలు చేపట్టారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. అక్కడ్నుంచి నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.

English summary
shocking elements in priyanka reddy case remand report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X