విచారణలో షాకింగ్: డ్రగ్ పెడ్లర్‌గా శ్యామ్ కే నాయుడు? కెల్విన్‌తో గంటలతరబడి పూరీ చాటింగ్!
డ్రగ్స్ కేసులో తాజాగా వెలుగుచూసిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడును సిట్ అధికారులు విచారణించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తాజాగా వెలుగుచూసిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడును సిట్ అధికారులు విచారణించిన విషయం తెలిసిందే. అయితే, తమకు డ్రగ్స్ మాఫియాతో ఎలాంటి సంబంధం లేదని వీరు సిట్ అధికారులతోపాటు మీడియాకు కూడా తెలిపారు.

గంటల తరబడి చాటింగ్..
కాగా, పూరీ జగన్నాథ్‌కు డ్రగ్స్ చేరవేసింది శ్యామ్ కే నాయుడేనని సిట్ అధికారులు తేల్చినట్లు సమాచారం. అంతేగాక, పూరీ జగన్నాథ్ ఇంటర్నేషనల్ సిమ్ ద్వారా గంటల తరబడి చాట్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై పూరిని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని చెప్పారు.

అంగీకరించిన పూరీ..
ఈ క్రమంలో సిట్ అధికారులు సిమ్ చూపించి, చాట్ వివరాలు చూపించేసరికి తప్పు అంగీకరించిననట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ నుంచి పూరీ జగన్నాథ్.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గంటల తరబడి చాట్ చేసినట్లు సమాచారం.
Recommended Video


పెడ్లర్‌లా శ్యామ్ కే నాయుడు..
ఆ సిమ్ ద్వారా గ్రూప్ కూడా క్రియేట్ చేసినట్లు, దాని ద్వారానే డ్రగ్స్ అమ్మకాలు సాగించినట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ దందా మొత్తం బట్టబయలైనట్లు సమాచారం. అయితే, విదేశాల నుంచి వచ్చే పార్సిల్స్‌ను పూరీకి అందించానే తప్ప, అందులో ఏముందో తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు చెప్పనిట్లు తెలుస్తోంది. దీనిపై సినీ నటుడు సుబ్బరాజును కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

రోజువారీగా సిట్ విచారణ: పూరీనే కీలకం?
జులై 19న పూరీ జగన్నాథ్‌ను విచారించిన సిట్ అధికారులు.. 20న శ్యామ్ కే నాయుడును విచారించారు. జులై 21 శుక్రవారం నాడు సుబ్బరాజును కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. కెల్విన్, పూరీతో ఎలాంటి సంబంధాలున్నాయనేదానిపై సిట్ అధికారులు సుబ్బరాజును ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications