‘నన్ను పెళ్లాడి మరో మహిళతో సంబంధం’: ఎస్ఐ ఇంటిముందు భార్య ధర్నా(పిక్చర్స్)
హైదరాబాద్: తనను పెళ్లాడి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని మోసం చేసిన అఫ్జల్‌గంజ్ ఎస్సై కరుణకుమార్‌పై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలంటూ అతని భార్య విజయరాణి కోరారు. బుధవారం డీడీకాలనీలో తన భర్త నివాసముంటున్నట్లు చెబుతున్న ఇంటి ముందు ఆమె ధర్నాకు దిగారు.
ఎమ్మార్పీఎస్ నాయకుల సహకారంతో ఆమె తన పాప అక్షయ, కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. అంబర్‌పేట పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గరిడేపల్లి కొత్తగూడెంకు చెందిన నకిరెకంటి కరుణకుమార్, నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన విజయరాణికి 2011 సెప్టెంబర్ 26న పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది.
వీరికి అక్షయ అనే పాప సంతానం. కాగా, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అప్పట్లో విజయరాణి కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అఫ్జల్‌గంజ్ పీఎస్‌లో ఎస్సైగా చేస్తూ ఆ మహిళతో కలిసి డీడీకాలనీ జయరాజ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడని చెప్పారు.
ఇదిలా ఉండగా, విజయరాణి.. ఎమ్మార్పీఎస్ నాయకురాలు రేణుక, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ గ్రేటర్ అధ్యక్షుడు విజయ్‌మాదిగ తదితరులతో కలిసి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎసై ఇంటి ముందే బైఠాయించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎస్సై కరుణకుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయరాణికి న్యాయం చేయాలని కోరారు.
మరోవైపు విజయరాణి భర్త వద్ద ఉంటున్న మహిళపై తనను దూషించిందని, అంబర్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయితే సదరు మహిళ సైతం విజయరాణి సోదరుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశారు.

బాధితురాలి ధర్నా
తనను పెళ్లాడి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని మోసం చేసిన అఫ్జల్‌గంజ్ ఎస్సై కరుణకుమార్‌పై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలంటూ అతని భార్య విజయరాణి కోరారు. బుధవారం డీడీకాలనీలో తన భర్త నివాసముంటున్నట్లు చెబుతున్న ఇంటి ముందు ఆమె ధర్నాకు దిగారు.

పెళ్లి ఫొటో
ఎమ్మార్పీఎస్ నాయకుల సహకారంతో ఆమె తన పాప అక్షయ, కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు.

ఎస్ఐ కరుణకుమార్
అంబర్‌పేట పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గరిడేపల్లి కొత్తగూడెంకు చెందిన నకిరెకంటి కరుణకుమార్, నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన విజయరాణికి 2011 సెప్టెంబర్ 26న పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగింది.

బాధితురాలి ధర్నా
విజయరాణి.. ఎమ్మార్పీఎస్ నాయకురాలు రేణుక, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ గ్రేటర్ అధ్యక్షుడు విజయ్‌మాదిగ తదితరులతో కలిసి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎసై ఇంటి ముందే బైఠాయించారు.












Click it and Unblock the Notifications