KCR కొత్త లెక్కలు: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీగా ఐఏఎస్..ఫైనల్ లిస్ట్ ఇదే..!!

తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి ఎంపికలో పూర్తి సమీకరణాలు పాటిస్తున్నారు. తుది జాబితా అధికారికంగా ప్రకటించకపోయినా... ఇప్పటికే అభ్యర్ధులుగా ఎంపిక చేసిన వారికి సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీల అభ్యర్దులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. రేపు ( మంగళవారం) నామినేషన్లకు చివరి రోజు. దీంతో..ఈ రోజు ఎమ్మెల్యే కోటాలో ఆరుగురితో పాటుగా గవర్నర్ కోటాలో గతంలో ఎంపిక చేసిన కౌశిక్ రెడ్డి స్థానంలో ఐఏఎస్ అధికారిని ఎంపిక చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఆరుగురి పేర్లు దాదాపు ఖరారు

ఆరుగురి పేర్లు దాదాపు ఖరారు

ఇదే సమయంలో స్థానిక సంస్థల కోటాలో అభ్యర్ధులను ఈ నెల 22న ఎంపిక చేయనున్నారు. గతంలో ఇచ్చిన హామీలు..సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడుగురి అభ్యర్ధులను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ రేసులో వరంగల్‌ జిల్లా నుంచి మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ జనరల్ సెక్రటరీ తక్కెళ్లపల్లి రవీందరావుల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. ఈ ముగ్గరికి ఖాయమైనట్లు చెబుతున్నారు.

ఇచ్చిన హామీ మేరకు ఎల్ రమణకు సైతం

ఇచ్చిన హామీ మేరకు ఎల్ రమణకు సైతం

మరోవైపు నల్గొండ జిల్లా నుంచి మాజీ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి లేదా కోటిరెడ్డిలల్లో ఒకరికి చాన్స్‌ దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ నుంచి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్‌.రమణ పేరు కూడా విన్పిస్తోంది. పద్మశాలీ కోటా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎవరూ లేరు. దీంతో ఈయన పేరు ఖాయమని తెలుస్తోంది. ఇదే సమయంలో అనూహ్యంగా ఒక ఐఏఎస్ అధికారికి ఈ సారి ఎమ్మెల్సీ పదవి దక్కబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ అధికారికి ఖాయమంటూ పార్టీలో ప్రచారం

ఆ అధికారికి ఖాయమంటూ పార్టీలో ప్రచారం

పార్టీలో జరుగుతున్న ప్రచారం మేరకు సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్సీగా పంపాలనే నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. అయితే, ఆయన అధికార పార్టీ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితంగా ఉంటారనే పేరు ఉంది. ఇక, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నా.. కడియం శ్రీహరికి ఇవ్వటంతో స్థానిక సంస్థల కోటాలో అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. కౌశిక్ రెడ్డిని గతంలో కేబినెట్ సమావేశంలోనే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపారు.

ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ రెడ్డి

అయితే, కౌశిక్ రెడ్డి పైన ఉన్న కేసుల కారణంగా గవర్నర్ ఇప్పటికీ ఆయన అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలపలేదు. అదే సమయంలో తిరస్కరణ చేయలేదు. దీంతో..ప్రభుత్వమే ఆ పేరు ఉప సంహరిచుకొని మరో పేరు ప్రతిపాదించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కౌశిక్ కు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఎల రమణను పార్టీ చేర్చుకొనే సమయంలోనే ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇవ్వటంతో ఆయనకు ఖాయమని చెబుతున్నారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ అధికారికంగా ఈ పేర్లను వెల్లడించనుంది. రేపు వీరంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+