ఖేల్‌రత్న అందుకున్న సింధు: 15 మంది అర్జున అవార్డులు

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు క్రీడల్లో భారతదేశపు అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా సింధు ఈ అవార్డును సోమవారం అందుకుంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో రాణించిన వారికి రాష్ట్రపతి భవన్‌లో అవార్డులను ప్రదానం చేశారు.

సింధుతో పాటు ఒలింపిక్స్‌లో సత్తా చాటిన రెజ్లర్ సాక్షి మాలిక్‌తో పాటు ఒలింపిక్స్‌లో పతకం సాధించకున్నా అద్భుతంగా రాణించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూరాయ్‌లు కూడా అవార్డుని అందుకున్నారు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులో భాగంగా విజేతలకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు ఏడున్నర లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తారు.

PV Sindhu with MOdi

భారత్‌కు తొలి ఒలింపిక్ రజత పతకం అందించిన మహిళగా పీవీ సింధు ఘనత సాధించగా, తొలి మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ కాంస్య పతకం దక్కించుకున్న సంగతి తెలిసిందే. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించడంతో పీవీ సింధు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా స్టార్ షట్లర్‌గా మారిపోయింది.

ఇప్పటికే సుమారు రూ. 13 కోట్లకు పైగా నగదు నజరానాలతో పాటు ఏపీ ప్రభుత్వ గ్రూప్ 1 ఉద్యోగం, అదేవిధంగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో 1000 గజాల ఇంటి స్థలం, సచిన్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారు లభించాయి.

అర్జున అవార్డులు అందుకున్న 15 మంది క్రీడాకారులు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 15 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు(2016)లను అందుకున్నారు. అవార్డులను అందుకున్న వారిలో రజత్ చౌహాన్ (ఆర్చ‌రీ), ల‌లితా బాబ‌ర్ (అథ్లెటిక్స్‌), సౌర‌వ్ కొఠారి (బిలియ‌ర్డ్స్‌), శివ‌థాపా (బాక్సింగ్‌), అజింక్యా ర‌హానే (క్రికెట్‌), సుబ్ర‌తా పాల్‌ (ఫుట్‌బాల్‌), రాణి (హాకీ), వీఆర్ ర‌ఘునాథ్‌ (హాకీ), గురుప్రీత్‌సింగ్ (షూటింగ్‌), అపూర్వి చందేలా (షూటింగ్‌), సౌమ్య‌జిత్ ఘోష్‌ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్‌), అమిత్‌కుమార్‌ (రెజ్లింగ్‌), సందీప్‌సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్‌), వీరేంద్ర సింగ్‌ (రెజ్లింగ్‌-బ‌ధిర‌)లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+