కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్.. టీబీజీకేఎస్‌ దూరం, జాతీయ సంఘాల మధ్యే పోటీ!!

నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 7గంటల నుంచి కౌంటింగ్, రెండు రౌండ్లలో ఫలితాలు ఇవ్వనున్నారు ఎన్నికల అధికారులు.మొత్తం 11 డివిజన్లలో పోలింగ్ కొనసాగుతుంది.

ఈ ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో పోలింగ్ కొనసాగుతుంది. 39,775 మంది కార్మికులు సింగరేణి వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Singareni election polling continues.. TBGKS dropped, competition between national unions!!

సింగరేణి ఎన్నికలు ప్రారంభమైన రెండు దశాబ్దాల కాలంలో ఇది ఏడో దఫా ఎన్నిక. లక్షా 20వేల మంది కార్మికులు ఉన్నప్పుడు మొదలైన ఈ ఎన్నిక ఇప్పుడు 39,775మంది కార్మికులు ఎన్నుకునే పరిస్థితికి వచ్చింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మొత్తం రాష్ట్రం రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించి ఈ ఎన్నికలకు ప్రచారం నిర్వహించారు..సింగరేణిలోని 13 సంఘాలు ఈ ఎన్నికల్లో గుర్తింపు, ప్రాతినిధ్యాల కోసం పోటీ పడుతున్నాయి.

సింగరేణిలోని 11 డివిజన్లలో 84 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి కార్మికులు ఎక్కడికక్కడే ఓటు వేసుకునే విధంగా సిద్ధం చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఏ డివిజన్‌లో ఆ డివిజన్‌కు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల బాక్సులను ఆ డివిజన్‌ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ సెంటర్లకు చేరవేస్తారు.

షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌, సీఐటీయూలతో పాటు ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ విప్లవ సంఘాల కూటమి కూడా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఇప్పటిదాకా సింగరేణి గుర్తింపు సంఘంగా వెలుగొందిన టీబీజీకేఎస్‌ అప్రకటితంగా ఎన్నికల్లో పోటీలో లేననే విధంగా చేతులెత్తేసింది.

అయినప్పటికీ సాంకేతికంగా బ్యాలెట్‌ పేపర్‌పై టీబీజీకేఎస్‌ కూడా ఎన్నికల్లో ఉంటుంది. వీటికి తోడు మరికొన్ని సంఘాలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కార్మిక సంఘం రెండేళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగుతుంది. జాతీయ కార్మిక సంఘాల మధ్యే ప్రధాన పోటీగా సింగరేణిలో వాతావరణం కనిపిస్తున్నది. పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఆయా ప్రాంతాల పోలీసులు, అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+