సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ 61 ఏళ్లకు పెంపు -మార్చి 31 తర్వాత దిగినోళ్లు మళ్లీ డ్యూటీల్లోకి..

తెలంగాణ పారిశ్రామిక, ఉపాది రంగాల్లో కీలకమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు సంబంధించి శుభవార్త వెలువడింది. సింగరేణిలో పనిచేసే కార్మికుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ శ్రీధర్‌ తెలిపారు.

సింగరేణిలో కార్మికుల రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలులోకి రానుందని సంస్థ సీఎండీ శ్రీధర్ చెప్పారు. ఈ నిర్ణయంతో మార్చి 31 జూన్‌ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగాలు వస్తాయని, 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

Singareni workers: SCCL Board enhance retirement age to 61 years

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. పెళ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలకూ కారుణ్య నియామకాల్లో అవకాశం దక్కనుంది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగాల్లో 10శాతం ఈబీసీ రిజర్వేషన్ల అమలుకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు సీఎండీ చెప్పారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగబేధం లేకుండా అవకాశాలకు అనుమతికి సమావేశం ఆమోదం తెలిపినట్లు వివరించారు

సింగరేణి సంస్థలో కార్మికుల రిటైర్మెంట్ వయసును 61కి పెంచాలని సీఎం కేసీఆర్.. ఈనెల 20న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు కార్మికుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని కూడా సీఎం నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+