పిడుగుపడి ముగ్గురు మృతి: చెరువులో పడి మరో ముగ్గురు చిన్నారులు..
వరంగల్: జిల్లాలోని చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం నెలకొంది. చెరువులో పడి రెండో తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను సాయిలు, అఖిల, అజయ్‌గా స్థానికులు గుర్తించారు.
ఈ ముగ్గురు పిల్లలు బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్నారుల మృతి వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన బుధవారం మధ్యాహ్నం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజిపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు గ్రామ శివారులోని దర్గా వద్ద కందూరు పండుగ చేసేందుకు వెళ్లారు.

దేవుడికి నైవేద్యం పెట్టేందుకు వంటలు తయారు చేస్తున్న క్రమంలో వర్షం పడింది. వెంటనే తలదాచుకోవడానికి ఆ పక్కనే ఉన్న చెట్టు కిందకు పరుగెత్తారు. అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టుకింద ఉన్నవారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు.
గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ వాహనంలో మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పాల్కొండ కృష్ణయ్య(52), ఎండీ సోహెల్(7), పెద్దమందిడి మండలం జంగమాయపల్లె గ్రామానికి చెందిన సుంకర రాములు(55) మృతిచెందారు. గాయపడిన వ్యక్తి మానాజిపేటకు చెందిన ఎండీ ఇమ్రాన్‌గా గుర్తించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications