ఆటోను ఢీకొన్న లారీ, 6గురు మృతి (ఫోటోలు)
హైదరాబాద్: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. పటాన్‌చెరు నుంచి సదాశివపేటకు వస్తున్న టాటాఏస్ వాహనం నెం. ఏపీ28 టీవీ 2444 అదే వైపునుంచి వస్తున్న ఏపీ12యూ 4931 నంబరున్న లారీ సంగారెడ్డి మండలం కంది శివారులోని ఐఐటీ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.
దీంతో ఆటోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుల్లో పుల్కల్ మండలం శివ్వంపేటకు చెందిన నిరూప(35), నవీన్‌కుమార్(28), సదాశివపేట మండలం సిద్దాపూర్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్(28), బండ్లగూడకు చెందిన రెడ్డిపల్లి యాదమ్మ(35) ఉన్నారు. గాయపడిన వారిలో ఆటో డ్రైవర్ రాజేష్(30), కందికి చెందిన శివకుమార్(28), సదాశివపేటకు చెందిన నిరీక్షణ్(26) ఉన్నారు.
విషయం తెలుసుకున్న కలెక్టర్ రాహుల్‌బొజ్జా, డీఎస్పీ తిరుపతన్నలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆసుపత్రులకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అదే విధంగా సంగారెడ్డి కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో జేసీ శరత్, ఆర్డీవో మధుకర్‌రెడ్డి, తహసీల్దార్ గోవర్ధన్‌లు క్షతగాత్రులను పరామర్శించారు.
ప్రమాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని కంటతడి పెట్టారు. రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఆటోను ఢీకొన్న లారీ, 6గురు దుర్మరణం
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఆటోను ఢీకొన్న లారీ, 6గురు దుర్మరణం
పోలీసుల వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. పటాన్‌చెరు నుంచి సదాశివపేటకు వస్తున్న టాటాఏస్ వాహనం నెం. ఏపీ28 టీవీ 2444 అదే వైపునుంచి వస్తున్న ఏపీ12యూ 4931 నంబరున్న లారీ సంగారెడ్డి మండలం కంది శివారులోని ఐఐటీ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.

ఆటోను ఢీకొన్న లారీ, 6గురు దుర్మరణం
విషయం తెలుసుకున్న కలెక్టర్ రాహుల్‌బొజ్జా, డీఎస్పీ తిరుపతన్నలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆసుపత్రులకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అదే విధంగా సంగారెడ్డి కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో జేసీ శరత్, ఆర్డీవో మధుకర్‌రెడ్డి, తహసీల్దార్ గోవర్ధన్‌లు క్షతగాత్రులను పరామర్శించారు.

ఆటోను ఢీకొన్న లారీ, 6గురు దుర్మరణం
ప్రమాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని కంటతడి పెట్టారు. రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Click it and Unblock the Notifications