ఈ బొప్పాయిలో అంతా స్పెషల్ ఏంటో.. ధర తెలిస్తే షాక్ పక్కా !
క్రైస్తవ మతం ప్రకారం ఆచరించే పండుగల్లో "కోతకాలం పండుగ" (Harvest Festival) ఒకటి. బైబిల్ ప్రకారం ఈ పండుగను "వారాల పండుగ" (పెంతెకొస్తు) లేదా "ఫలసంగ్రహపు పండుగ" కృతజ్ఞతార్పణ పండుగ అని కూడా పిలుస్తారు. దేవుడు ప్రసాదించిన పంటలకూ, జీవితంలోని ప్రతి ఆశీర్వాదానికీ కృతజ్ఞత తెలియజేసే సందర్భంగా కూడా పరిగణిస్తూ.. తిరిగి సమర్పించడం లేదా పంచుకోవడం ఈ వేడుక ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు.
ఇందుకు బైబిల్‌లోని పలు వాక్యాల్లో కూడా ప్రస్తావించడం గమనించవచ్చు. బైబిల్‌లో (నిర్గమకాండము 23:16) ఈ విధంగా పేర్కొనబడింది. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఈ ప్రకారమే దేవుని ఆశీర్వాదంగా లభించిన పంటలకూ కృతజ్ఞత తెలుపుతూ ఉంటారు. అందులో భాగంగానే కోతకాలం పండుగ కేవలం వేడుకగానే కాకుండా కృతజ్ఞత, దాతృత్వం, పంచుకోవడం వంటి విషయాలను గుర్తు చేసే ఒక ఆధ్యాత్మిక ఉత్సవంగా వెల్లడిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోని పలు చర్చిలలో ఈ పండుగను విశేషంగా జరుపుకున్నారు. చర్చిలలో పండ్లు, ధాన్యం సహా పలు వాటిని సమర్పించారు. అనంతరం వాటిని వేలం పాట వేసి వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఈ మేరకు హైదరాబాద్ లోని రామంతాపూర్ ఏరియాలో ఉన్న CSI పాస్నెట్ మెమోరియల్ చర్చ్‌లో ఈ సంవత్సరం కోతకాలం పండుగ ఘనంగా నిర్వహించారు.
భారీ ధరకు బొప్పాయి పండు..
ఈ వేడుకలో ముఖ్య ఆకర్షణగా నిలిచింది 'బొప్పాయి పండు వేలం'. పండుగ సందర్భంగా చిన్న బొప్పాయి పండును వేలం నిర్వహించగా.. సుమతి అనే నర్సింగ్ లెక్చరర్ 8,500 రూపాయలకు బొప్పాయి పండును దక్కించుకున్నారు. కేవలం 100 రూపాయలతో ప్రారంభమైన చివరికి ఇంత పెద్ద మొత్తంలో పలకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో భాగంగా సేకరించిన మొత్తం చర్చ్ సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. దేవుడికి ఇవ్వడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేనిదని.. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలలో కొంచెం భాగం తిరిగి సేవకు అందించగలగడం నిజమైన కృతజ్ఞతగా చెప్పుకొచ్చారు.













Click it and Unblock the Notifications