తెలంగాణలో ఎంతోమంది అందమైన యువతులు, నాకంటేనూ: రష్మీ
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో అందమైన యువతులు ఎందరో ఉన్నారని మిస్ ఇండియా రష్మీ ఠాగూర్ సోమవారం నాడు అన్నారు. ఆమె ఈ రోజు వరంగల్‌లోని ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు.
కరీంనగర్ జిల్లా రామగుండం పట్టణంకు చెందిన తాను మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ క్వీన్, మిస్ ఫెయిర్ అవార్డులను సాధించానని చెప్పారు. తెలంగాణలో తనకన్నా ఎందరో అందమైన యువతులు ఉన్నారని చెప్పారు.

అందాల పోటీలలో పాల్గొనాలనుకునే వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అందాల పోటీలకు వెళ్లాలనుకునే వారికి తాను శిక్షణ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. తాను ఏర్పాటు చేయనున్న శిక్షణా కేంద్రానికి ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications