టెక్కీ ఆత్మహత్య: ఉరేసుకుని మరణించిన బిటెక్ విద్యార్థిని

హైదరాబాద్: హైదరాబాదులో బుధవారం వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ఒకతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా, మరొకరు బిటెక్ విద్యార్థిని. 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నరేష్ రెడ్డి కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీ బీ బ్లాక్‌లో తన ఫ్లాట్‌లో విషం తీసుకని మరణించాడు.

నరేష్ రెడ్డి ఓ బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్నాడు. అతను మంగళవారంనాడు విధులకు వెళ్లలేదు. మంగళవారం నుంచి ఫోన్ కాల్స్‌కు కూడా సమాధానం ఇవ్వలేదు. కుటుంబ సభ్యులు అతని కార్యాలయాన్ని సంప్రదించి అతని సహోద్యోగులతో కలిసి బుధవారంనాడు ఫ్లాట్‌కు వచ్చారు.

నరేష్ సహోద్యోగులు ఫ్లాట్ తలుపులు పగులుగొట్టి, లోనికి ప్రవేశించారు. వారు చూసేసరికి నరేష్ రెడ్డి పడకపై అచేతనంగా పడి ఉన్నాడు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు. అతని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు కుటుంబ సభ్యులను, సహోద్యోగులను ప్రశ్నిస్తున్నారు.

Software engineer and engineering student commit suicide in Hyderabad

ఇదిలావుటంే, హైదరాబాదులోని అడ్డగుట్టలో 20 ఏళ్ల బిటెక్ విద్యార్థిని శివాని ఆత్మహత్య చేసుకుంది. బుధవారంనాడు తమ ఇంట్లోనే ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శవాని ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. అక్టోబర్ 31వ తేదీన సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది..

పోలీసులు సూసైడన్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు .తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని అంటూ తల్లికి సారీ చెబుతూ సూసైడ్ నోట్ రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+