వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Solar Rooftop In Schools: మార్చిలోగా 500 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ రూఫ్‍టాఫ్ ఏర్పాటు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి కరెంట్ అందివ్వనున్నారు. మార్చి కల్లా 500 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరం 12 జిల్లాల్లోని 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో 32 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌ఆర్‌ఇడిసిఓ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 100కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు.

మరో 453 పాఠశాలలకు వర్క్ ఆర్డర్‌లు ఉన్నాయి. "ప్రాజెక్ట్ మొదటి దశలో, మేము సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేస్తాము. రాబోయే కొద్ది నెలల్లో మొత్తం 1,521 పాఠశాలల పనిని పూర్తి చేయాలని మేము భావిస్తున్నాము" అని లంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.

Solar rooftop will be installed in 500 government schools in Telangana by March

TSREDCO గత సెప్టెంబరులో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించింది. టెండర్ తర్వాత 11 కంపెనీలకు ఓకే చెప్పారు. ఎంపికైన సంస్థలు పాఠశాలల్లో 2 కిలోవాట్ల నుంచి 5 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 200 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలను సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ఎంపిక చేశారు. ఎంపికైన 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో 916 సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కింద, 605 నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కింద ఉన్నాయి.

సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల పాఠశాలల విద్యుత్ బిల్లు ఉండదు. అలాగే అదనపు విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్‌కు బదిలీ చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

English summary
Solar system will be installed and electricity will be provided in government schools in Telangana. The government has decided to provide electricity through solar system in 500 government schools by March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X