కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ : పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ : బీజేపీ నేత, కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నీ అంతు చూస్తానని బెదిరించాడు. ఈ మేరకు కిషన్ రెడ్డి కాచిగూడ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా బెదిరింంపు కాల్ వచ్చిందని కంప్లైంట్ లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

some one threatned by kishan reddy

గతంలోనూ ..
ఇప్పడే కాదు మార్చిలోనూ కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలో దుండగుడు చంపేస్తానని బెదిరించాడు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి తన ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు తెలిపారు. తాజాగా మరోసారి ఫోన్ రావడం కలకలం రేపుతోంది.

రెండుసార్ల బెదిరింపులు ...
బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి .. ఎంపీగా గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికలు జరిగే ముందు .. జరిగిన తర్వాత బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దీనిపై విచారణ జరిపి .. ఆకతాయా లేదా నిజమైన బెదిరింపులా అనే అంశాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+