హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్ఫీ వీడియో తీసుకుని లాడ్జీలో తల్లీకొడుకు ఆత్మహత్య: రాజకీయ నేతలతోపాటు పోలీసు అధికారే కారణం

|
Google Oneindia TeluguNews

మెదక్: కామారెడ్డిలో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ మహారాజా లాడ్జీలోని ఓ గదిలో తల్లికుమారుడు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున గది నుంచి పొగలు రావడం గమనించిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు లాడ్జీకి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మృతులను రామాయం పేటకు చెందిన తల్లి పద్మ(65), కుమారుడు సంతోష్‌(40)లుగా గుర్తించారు.

తల్లీకొడుకు ఆత్మహత్యకు ఆ ఏడుగురే కారణం

తల్లీకొడుకు ఆత్మహత్యకు ఆ ఏడుగురే కారణం

తల్లి పద్మ వైద్యం కోసం ఏప్రిల్ 11న లాడ్జికి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సోమనాథం, సీఐ నరేష్ పరిశీలించారు. వీరిద్దరి ఆత్మహత్యకు ఏడుగురు కారణం అని రాసిపెట్టి ఉన్న సూసైడ్ లేఖను పోలీసులు ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు, ఆత్మహత్యకు ముందు తల్లీకుమారుడు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోలో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిపై వారి ఆవేదనను వెలిబుచ్చారు.

రూ. 50 లక్షల డిమాండ్.. రాజకీయ నేతలు, పోలీసు అధికారి వేధింపులు

రూ. 50 లక్షల డిమాండ్.. రాజకీయ నేతలు, పోలీసు అధికారి వేధింపులు

తమ ఆత్యహత్యకు కారణమైన వారి గురించి, వారు తమ కుటుంబానికి చేసిన మోసాలు, పెట్టిన ఇబ్బందులను గురించి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు తల్లీకుమారుడు పద్మ, సంతోష్‌లు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంతోష్‌ను భూములు అమ్మే విషయంలో తమకు రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు పోలీసు అధికారితో కలిసి డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేగాక, ఫేస్‌బుక్‌లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సదరు ప్రజాప్రతినిధులు సంతోష్‌పై కక్ష కట్టారని మృతుల కుటుంబసభ్యులు తెలిపారు.

సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమైన సంతోష్

సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమైన సంతోష్

తల్లీ పద్మ, కుమారుడు సంతోష్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న వీడియోలో తమ ఆవేదనను, బాధను వెలిబుచ్చారు. సెల్ఫీ వీడియోలో సంతోష్ ఏం చెప్పారంటే.... 'బాసం శ్రీనుతో కలిసి నేను వ్యాపారం చేశా. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ గౌడ్ కోరారు. ఇవ్వలేమని.. కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్‌కు పిలిచారు. నా ఫోన్‌ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నారు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు. దీనిపై మరుసటి రోజే మెదక్ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా. 10 రోజులయ్యాక ఫేస్‌బుక్‌ అంశంలో సంబంధం లేదన్నారు. నా ఫోన్‌లో సమాచారాన్ని పోలీసులు జితేందర్‌గౌడ్‌కు ఇచ్చారు. అప్పటి నుంచి జితేందర్‌గౌడ్ మనుషులు ఫోన్‌లోని సమాచారంతో ఇబ్బంది పెట్టారు. నన్ను బెదిరించే విషయాన్ని కూడా పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. ఏడాది పాటు జితేందర్ గౌడ్ మనుషులు నన్ను ఇబ్బంది పెట్టారు. నా వ్యాపారం సాగనీయలేదు, అర్థికంగా నష్టపోయాను. అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. నన్ను మానసికంగా కుంగిపోయేలా చేశారు. నమ్మిన స్నేహితుడే దగా చేయడం తట్టుకోలేకపోయాను. వాళ్ల ఇబ్బందులు తట్టుకోలేకనే నేను, అమ్మ చనిపోతున్నాం" అని వాపోయాడు. కాగా, ఈత్మహత్య ఘటనపై బాధితులు చెప్పినఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రామాయంపేటలో ఉద్రిక్తత

మున్సిపల్ ఛైర్మన్ ఇంటి వద్ద మృతదేహాలతో ఆందోళన చేశారు స్థానికులు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలను, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా మోహరించిన పోలీసులు వారిని శాంతింపజేశారు.

English summary
son and his mother committed suicide in lodge in Kamareddy; political leaders and police officer name in suicide note
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X