దారుణం: కన్న తల్లినే కర్రతో కొట్టి చంపేశాడు
హైదరాబాద్: నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిట్టీల వ్యాపారం చేసి నష్టాలు తీసుకొచ్చిందనే కోపంలో కన్నతల్లినే పాశవికంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు.
చిట్టీల వ్యాపారంలో అప్పులు పాలు కావడంతో అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి నిలదీస్తున్నారని కొడుకు అవమానంగా భావించాడు. దీంతో తల్లి మమతను కొడుకు మదన్(22) బుధవారం రాత్రి భవనం పైకి తీసుకెళ్లి కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడి భార్యపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications