టెక్కీ కూచిభొట్ల హత్య: జాతివివక్షతోనే, అభియోగాలు నమోదు

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్ట‌న్: అమెరికాలో హ‌త్య‌కు గురైన తెలుగు టెకీ కూచిబొట్ల శ్రీనివాస్ కేసులో ద‌ర్యాప్తు వేగం పుంజుకుంది. క‌న్సాస్ సిటీ బార్‌లో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌ను జాతి వివ‌క్ష దాడిగా విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు అమెరికా న్యాయ‌శాఖ తెలిపింది. ఈ కేసులో అభియోగాలు న‌మోదు అయ్యాయి.

జాత్యాంహ‌కార దాడి, మార‌ణాయుధాలు క‌లిగి ఉన్న అభియోగాలను మోపి కూచిబొట్ల కేసును ద‌ర్యాప్తు చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 22న జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆడమ్ పురింట‌న్ అనే వ్య‌క్తి ఆస్టిన్ బార్‌లో కాల్పులు జ‌రిపాడు. ఆ ఘ‌ట‌న‌లో కూచిబొట్ల ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు.

Srinivas Kuchibhotla shooting: Navy veteran indicted for hate crime charges

గాయపడినవారిలో అలోక్ మ‌ద‌సాని ఉన్నాడు. అయితే జాతి వివ‌క్ష‌తోనే పురింట‌న్ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. పిస్తోల్‌తో కాల్పులు జ‌రిపే ముందు మీ దేశానికి వెళ్లిపోవాలంటూ పురింట‌న్ అరుపులు పెట్టిన‌ట్లు సాక్షులు తెలిపారు.

నిందితుడు పురింట‌న్‌ను అడ్డుకున్న అమెరికా శ్వేత‌జాతీయుడు ఇయాన్ గ్రిల్ల‌ట్ ఇదే ఘ‌ట‌న‌లో హీరోగా ప్రశంసలు అందుకున్నాడు. ఆ కాల్పుల ఘటన ఫిబ్రవరి 22వ తేదీన జరిగింది. నేరం రుజువైతే ప్యురింటన్‌కు మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Adam Purinton, the man accused of killing Indian techie Srinivas Kuchibhotla and injuring two others at a suburban Kansas City bar, has been indicted on federal hate crime and firearms charges.
Please Wait while comments are loading...