శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు ఒకలా, తండ్రి మరోలా

స్టార్ హీరో అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో రేవతి అనే మహిళ మరణించారు. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీతేజ్‌ ఆరోగ్యం సైతం క్రిటికల్‌గానే ఉందని వైద్యులు తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిందని, కోలుకోవడం కష్టమే అని వైద్యులు తెలపడం జరిగింది. సోమవారం రాత్రి శ్రీతేజ్‌ ఆరోగ్యానికి సంబందించి ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

శ్రీతేజ్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు ఆక్సిజన్, వెంటిలేటర్ సహాయాన్ని పూర్తిగా తొలగించినట్లు ప్రకటించారు. శ్రీతేజ్ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకుంటోంది. జ్వరం తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. తెల్ల రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. ఇది శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతున్న సంకేతంగా భావించవచ్చని వైద్యులు ప్రకటించారు. అతనికి ప్రస్తుతం పైపు ద్వారా ఆహారం అందిస్తున్నారు.. ఇది శరీరానికి అవసరమైన పోషకాలు అందించడానికి ఉపయోగపడుతోంది.

Sritej father reaction on son Health

శ్రీతేజ్ గాయం తీవ్రత దృష్ట్యా మొదట పరిస్థితి ఆందోళనకరంగా కనిపించినప్పటికీ.. చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. వ్యాధినిరోధక వ్యవస్థలో మార్పులు కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కొడుకు ఆరోగ్యంపై శ్రీతేజ్ తండ్రి వాదన మరోలా ఉంది. శ్రీతేజ్ తనను గుర్తు పట్టడం లేదని, అతడి ఆరోగ్యం విషయంలో ఇంకా ఆందోళనకరంగానే ఉందని ఆయన తెలిపారు.

కన్న కొడుకు తనని గుర్తు పట్టడం లేదంటూ భాస్కర్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సహాయం చేసిందని, అలాగే అల్లు అర్జున్‌ తరపు నుంచి సాయం అందిందని ఆయన చెప్పుకొచ్చాడు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడంకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని భాస్కర్‌ అన్నాడు. తనయుడు ఆరోగ్యంపై ఆందోళనతో భాస్కర్ కనిపిస్తున్నారు. మరోవైపు శ్రీతేజ్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+