తిండిలేక, రోడ్డుపై గడుపుతున్నాం: కేటీఆర్‌కు వీడియో సందేశం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 24 మంది సౌదీ అరేబియాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏపీకి చెందిన పదిమంది, తెలంగాణకు చెందిన నలుగురు, ఒడిశాకు చెందిన పదిమంది సాయం కోసం అర్థిస్తున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 24 మంది సౌదీ అరేబియాలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏపీకి చెందిన పదిమంది, తెలంగాణకు చెందిన నలుగురు, ఒడిశాకు చెందిన పదిమంది సాయం కోసం అర్థిస్తున్నారు.
ఓ ఏజెంట్ ద్వారా వారు సౌదీకి వెళ్లారు. అతను వారిని మోసం చేశాడని ఆలస్యంగా గుర్తించారు. కంపెనీ కూడా వారిని పట్టించుకోలేదు. దీంతో వారు ప్రమాదకర పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో బాధితులు ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. వారు తెలంగాణ ఎన్నారై అఫైర్స్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సందేశం పంపించారు. వారు తమ ఇబ్బందులు వెల్లడించి, సాయం కోరారు. వారికి సాయం చేసేందుకు మంత్రి కేటీ రామారావు వారి కాంటాక్ట్ నెంబర్ అడిగారు.
Please pass on some contact details so we can reach out https://t.co/QX6PsxTrk7
— KTR (@KTRTRS) May 7, 2017
తమకు తినేందుకు ఆహారం లేదని, తాము రోడ్ల పైన బతుకును వెళ్లదీస్తున్నామని, తాము ప్రమాదక పరిస్థితుల్లో ఇక్కడ పని చేస్తున్నామని, తమను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వారు మంత్రికి తమ ఇబ్బందలను వివరించారు. తాము రియాద్‌కు ఎలా వచ్చాం, ఎలా తిరిగి రాలేకపోతున్నామో వెల్లడించారు.
బాధితులు అక్టోబర్ 2016లో ఓ ఏజెంట్ ద్వారా రియాద్ వెళ్లారు. అక్కడ వారికి వివిధ నిర్మాణ కంపెనీలలో ఉద్యోగం కల్పించారు. కానీ అక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేవు. పరిస్థితి దారుణంగా ఉంది. వారికి సరైన ఆహారం కూడా అందించలేదు.
అంతేకాదు, వారికి అక్కడ కల్పించే ఇకామా అంటే ఐడెంటిటీ కూడా కల్పించలేదు. అది ఇస్తే వారు అక్కడ చట్టబద్దంగా పని చేస్తున్నట్లు ఉంటుంది. కానీ ఐడెంటిటీ లేని పరిస్థితుల్లో పని చేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన ఇండియన్ ఎంబసీ వారికి సాయం చేసేందుకు సిద్ధపడింది. అప్పుడు వారు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం హఠాత్తుగా.. ఏప్రిల్ 9న వారికి ఐడెంటిటీ ఇచ్చింది. తద్వారా వారిని వెళ్లనీయకుండా అలా చేసింది.
ఏప్రిల్ 14న వారు ఎంబసీకి సమాచారం పంపించారు. తమకు ఐడెంటిటీ ఇచ్చారని, తాము కంపెనీలోనే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications