భూముల ధరల పెంపు - హైదరాబాద్ సహా ఎక్కడ ఎంత..!!
తెలంగాణలో భూముల విలువలు పెరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాద నలు సమర్పించారు. వంద నుంచి నాలుగు వందల శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలు స్తోంది. ఏప్రిల్ 1 నుంచి పెంపు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రాంతాలకు అనుగుణంగా సవరణ లు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ 60 శాతం మేర పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. మార్కెట్ విలువల హేతుబద్ధీకరణతో అదనంగా 40 శాతం అదనపు ఆదాయం కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఎక్కడ ఎంత మేర పెరిగే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి.
భూముల విలువ పెంపు
తెలంగాణ వ్యాప్తంగా భూముల విలువలు పెరగనున్నాయి. ఓపెన్ మార్కెట్ - రిజిస్ట్రేషన్ పుస్తక విలువలకు భారీగా వ్యత్యాసం ఉంది. దీంతో, భూములు - ఆస్తుల విలువల హేతుబద్ధీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మార్కెట్ విలువల్లో హెచ్చు- తగ్గుదల పైన కసరత్తు చేసిన అధికార యంత్రాగం ప్రభుత్వానికి తాజాగా పలు సవరణలతో ప్రతిపాదనలు అందించింది. తాజా గా ముఖ్యమంత్రి రేవంత్ సైతం శాస్త్రీయ పద్దతిలో ప్రతీ ఏటా భూముల విలువ పెంచాలని అధికారులకు సూచించారు. దీంతో, తాజా ప్రతిపాదనల మేరకు ఆరేళ్ల తరువాత తెలంగాణలో భూముల విలువ పెంచేందుకు రంగం సిద్దమైంది.

ఎక్కడ ఎంత
ప్రాంతాలకు అనుగుణంగా 15-30 శాతం మేర.. అదే విధంగా స్థలాల విలువను బట్టి మూడు నుంచి నాలుగు రెట్లు వరకు పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకేసారి భూముల విలువ పెంచితే మార్కెట్ పైన ప్రభావం చూపుతుందనే ఆందోళన కనిపిస్తోంది. దీంతో,
ఆచితూచి విలువ పెంపు పైన నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్ లోని కొండాపూర్, గచ్చి బౌలి లో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ప్రస్తుతం గజం ధర రూ.26700గా ఉంది. కమర్షియల్ స్థలమైతే గజం రూ.44900 ఉంది. నార్సింగ్‌లో గజం రూ.23800, మణికొండలో రూ.23900, రాయదుర్గంలో రూ.44900, బుద్వేల్‌లో రూ.10200గా ఉంది. వీటి విలువను మూడు వందల శాతం వరకు పెంచే అవకాశం ఉంది.
క్రమబద్దీకరణ
ఇదే సమయంలో మూడు వేల కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో భూముల విలువను రేషనలైజ్ చేసేలా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి 100 నుంచి 200 శాతంపైగా పెంచాలనే ఆలోచన చేస్తున్నారు. శేరిలింగం పల్లి వంటి ప్రాతాల్లో ప్రస్తుతం స్థలాల విలువ గజం రూ 26 వేల వరకు ఉంది. ఇది రూ 50 వేల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2023-24 లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖకు మొత్తం 14,588 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిపై 40 శాతం అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటి పైన ప్రభుత్వం అధ్యయనం చేసిన తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications