మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థి మృతి: అసలేం జరిగింది?
మేడ్చల్: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి క్లాసులో ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో యూనివర్సిటీ క్యాంపస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో అరుణ్ అనే విద్యార్థి (19) మృతి చెందాడు.
బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ క్లాసులో స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. కాగా, అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే అరుణ్ మృతి చెందాడని విద్యార్థుల ఆందోళన చేశారు. అయితే, అరుణ్ ఏం జరిగింది? ఉన్నట్టుండి ఎందుకు స్పృహతప్పి కిందపడిపోయాడు? అనే ప్రశ్నలకు స్పష్టత రాలేదు.

అనారోగ్యం సమస్యలు ఉండటం వల్ల ఇలా జరిగిందా? లేక సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో పలువురు ఉన్నట్టుండి కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొందరు డ్యాన్సులు చేస్తూ.. మరికొందరు జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ చనిపోయారు. మరికొందరు కుర్చీలో కూర్చొనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా కారంపూడిలో చోటు చేసుకుంది. స్థానిక మోడల్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న రవికుమార్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు రవికుమార్‌పై దాడి చేశారు.
గురువు స్థానంలో ఉండి విద్యార్థినుల పట్ల ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల వసతి గృహంలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తుంటే పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే రవికుమార్ ను విధుల నుంచి తొలగించాలని ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎంఈవో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications