ఫుడ్ పాయిజన్: ఆహారం వికటించి నిట్ విద్యార్థుల అస్వస్థత
వరంగల్ ఎన్ఐటీ క్యాంపస్‌లో చదువుతున్న బీటెక్, ఎంటెక్, ఎస్వోఎం విభాగాలకు చెందిన విద్యార్థులు క్యాంపస్ బయట ప్రయివేటు కేఫ్‌లో తినుబండారాలు తిని అవి వికటించడంతో 17 మంది అస్వస్థతకు గురయ్యారు.
వరంగల్: వరంగల్ ఎన్ఐటీ క్యాంపస్‌లో చదువుతున్న బీటెక్, ఎంటెక్, ఎస్వోఎం విభాగాలకు చెందిన విద్యార్థులు క్యాంపస్ బయట ప్రయివేటు కేఫ్‌లో తినుబండారాలు తిని అవి వికటించడంతో 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురు ఇంటికి వెళ్లారు.
రెండు రోజుల క్రితం బుధవారం రాత్రి నిట్‌లోని ఎస్‌వోఎం విభాగానికి చెందిన విద్యార్థులు ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఓ కేఫ్‌కు వెళ్లారు. వేర్వేరు ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి తిన్నారు. అనంతరం క్యాంపస్‌కు వెళ్లిన తర్వాత వాంతులు, విరేచనాలతో పాటు తీవ్ర జ్వరం వచ్చింది.
బుధవారం రాత్రి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరుసటి రోజు నిట్ అధికారులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఏడుగురిని రోహిణి ఆసుపత్రిలో చేర్పించారు. అదే కేఫ్‌లో ఆహారం స్వీకరించిన మరికొందరు విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వారు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై కదలలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. చికిత్స తర్వాత కోలుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువమంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు.
సిద్రా కేఫ్‌లో ఆహార నాణ్యత లోపించడంతోనే తాము అస్వస్థతకు గురయ్యామని వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా, విషయం తెలుసుకున్న నిట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్యాం, సురేందర్, ఎంఎస్‌వో రాజారెడ్డిలు సిద్రా హోటల్‌పై దాడి చేసి ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications