Mahabubabad: ఫుడ్ పాయిజన్‍తో విద్యార్థినులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
ఈ మధ్య ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కామన్ అయిపోయింది. నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆస్వస్థతకు గురువుతున్నారు. తాజాగా మహబాబాబాద్ లోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 15 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
బుధవారం రాత్రి విద్యాలయంలో విద్యార్థినులు రాత్రి టమాటా కర్రితో భోజనం చేశారు. గురువారం ఉదయం విద్యార్థినులు అస్వస్థ పాలయ్యారు. అందులో 15 మందికి వాంతలు, విరోచనాలు కావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే వారిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిలకు వైద్యలు చికిత్స చేశారు.

ప్రమాదం ఏమి లేదని చెప్పారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications