భర్తను చంపిన స్వాతి: వెలుగులోకి మరో విషయం, రెండేళ్ల పరిచయంలో ఏడాదిగా, ఆ రోజేం జరిగిందంటే?
హైదరాబాద్/నాగర్ కర్నూలు: సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. స్వాతి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడం మొదలు యాసిడ్ దాడి, ఆసుపత్రికి తరలించే వరకు ఆడిన నాటకాలు, అంతకుముందు జరిగిన విషయాలు ఒక్కటొక్కటి వెలుగు చూస్తున్నాయి.
Recommended Video

తాజాగా మరో కొత్త విషయం కూడా వెలుగు చూసింది. సుధాకర్ హత్యకు భార్య స్వాతి, ప్రియుడు రాజేష్ మూడు నెలల ముందే ప్రణాళిక వేసినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో ప్రియుడు రాజేష్ అనుకోకుండా హత్య జరిగిందని చెబుతుండటం కట్టుకథేనా అనే అనుమానం కలుగుతోంది.

స్వాతి-రాజేష్‌ల పరిచయం ఇలా
స్వాతి, రాజేష్‌ల మధ్య రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ వారి మధ్య వివాహేతర సంబంధం మాత్రం ఏడాదికి పైగా కొనసాగుతోందని తెలుస్తోంది. నడుము నొప్పి చికిత్స కోసం 2015లో నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఫిజియోథెరపి కేంద్రానికి వెళ్లిన స్వాతికి అక్కడ పనిచేస్తున్న రాజేష్ పరిచయం ఏర్పడింది.

ఏడాదిగా వివాహేతర సంబంధం
ఈ పరిచయం గత ఏడాది అంటే 2016లో వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత ఏడాది నుంచి స్వాతి, రాజేష్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా, ఈ విషయం సుధాకర్ రెడ్డికి గత నవంబరు 25న తెలిసింది.

ఆ విషయం తెలిసి మద్యం తాగి వచ్చాడు
దీంతో సుధాకర్‌రెడ్డి 26న మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి భార్య స్వాతితో గొడవపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. తనకు తెలిసి బంధువును స్వాతి పిలిపించుకొని నాగర్ కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. తలకు తగిలిన గాయాలకు కుట్లు వేయించుకొని చికిత్స చేయించింది.

ఏది నిజమో పోలీసుల విచారణలో తేలుతుంది
నవంబర్ 27న తెల్లవారుజామున ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం స్వాతి, రాజేష్‌లు కలిసి సుధాకర్ రెడ్డిని హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. రాజేష్ - స్వాతిల విషయం తెలిసిన రెండు రోజులకే అతనిని హత్య చేశారు. భర్తకు తెలిసిందని హత్య చేశారా లేక మూడు నెలలకు ముందే హత్యకు ప్లాన్ వేశారని ప్రచారం జరుగుతున్నందున ఏది నిజమనేది పోలీసుల విచారణలో తేలనుంది.

రాజేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే
కాగా, నిందితుడు రాజేష్ కొత్తకోట మండలంలోని అజ్ఞకోల్ వాసి. నాగర్ కర్నూలులో ఫిజియోథెరఫీ కేంద్రంలో నామమాత్రపు వేతనంతో పని చేస్తున్నాడు. తండ్రి మూడు నెలల క్రితమే చనిపోయాడు. తల్లితో కలిసి నాగర్ కర్నూలు మండలం నాగలూరులో ఉంటున్నాడు. రాజేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రాజేష్ బంధువులు ఆసుపత్రి వైపు రాలేదు.

నాగర్ కర్నూలుకు రాజేష్ తరలింపు
ఇదిలా ఉండగా, రాజేష్‌ను గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిని నాగర్ కర్నూలుకు తరలించారు. భర్త సుధాకర్ అంటే స్వాతికి ఇష్టం లేదని, అందుకే తనకు దగ్గరయిందని, ఎటైనా వెళ్పిపోదామంటే పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నదని ఆమె చెప్పిందని, సుధాకర్‌ను తాము చంపాలనుకోలేదని, అనుకోకుండా అలా జరిగిపోయిందని చెప్పిన విషయం తెలిసిందే.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications